Ads
భారత రాజ్యాంగ పితామహుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్య్ర భారతదేశంలో తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. దేశంలోనే ప్రముఖ న్యాయనిపుణుడిగా, సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా అంబేడ్కర్ ప్రసిద్ధి చెందారు.
Video Advertisement
అంబేడ్కర్ ఒక్క రాజ్యాంగ నిర్మాణంలోనే కాకుండా, దళిత సమాజ అభ్యున్నతి కోసం కూడా కృషి చేశారు. కుల నిర్మూలన, అంటరానితనం కోసం చాలా కృషి చేశారు. చిన్నతనం నుండే తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొని, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అంబేడ్కర్ తన చదువును, తెలివిని అణగారిన వర్గాల కోసమే ఉపయోగించారు. మహాత్మా గాంధీ మరణించిన తరువాత అంబేద్కర్ గాంధీజీ గురించి ప్రస్తావిస్తూ తన భార్య లక్ష్మీ కబీర్ కి లెటర్ వ్రాసారు. అందులో మహాత్మా గాంధీ మరణం గురించి తన అభిప్రాయాలను తెలియచేశారు.
”ఒకరి చేతిలో గాంధీ చంపబడడం నన్ను బాధించింది. ఇలాంటి నీచమైన పని చేయడం చాలా తప్పు. నేను గాంధీకి రుణపడి లేను. ఆయన ఆధ్యాత్మిక, నైతికంగా మరియు సామాజికంగా నాకు ఎలాంటి సహకారం అందించలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. నా జీవితంలో నేను ఋణపడి ఉన్న వ్యక్తి గౌతమ బుద్ధుడు మాత్రమే. అయినప్పటికీ, గాంధీ మరణ వార్త తెలియగానే చాలా బాధపడ్డాను. గాంధీ నా పట్ల వ్యతిరేక భావంతో ఉన్నప్పటికీ, శనివారం నాడు ఉదయం బిర్లా హౌస్‌కి వెళ్లి గాంధీ భౌతికకాయాన్ని చూశాను. ఆయన దేహం పై గాయాలను చూసి చలించిపోయాను.
నా అభిప్రాయం ప్రకారం గొప్ప వ్యక్తులు దేశానికి సేవ గొప్పగా చేస్తారు. కానీ వారు దేశ అభివృద్దికి కొన్నిసార్లు కొన్ని విషయలలో అడ్డంకిగా ఉంటారు. గాంధీ హత్యకు బాధగా ఉన్నా, గాంధీజీ మన దేశానికి మంచి ప్రమాదంగా మారారు. ఆయన స్వేచ్ఛా ఆలోచనలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆయన చెడు, స్వార్థపూరిత అంశాలతో కూడిన కాంగ్రెస్‌ను పట్టుకుని ఉన్నాడు. కాంగ్రెస్ అనేది గాంధీని పొగడడం తప్ప సామాజిక, నైతిక సూత్రాలను ఒప్పుకోని సొసైటీ.
అలాంటి సొసైటీ దేశాన్ని పరిపాలించడానికి అర్హత లేనిది. బైబిల్ లో ‘చెడు నుండి కొన్నిసార్లు మంచి వస్తుంది’ అని ఉన్నట్లుగా, నేను గాంధీ మరణం నుండి మంచి వస్తుందని అనుకుంటున్నాను. ఇది ప్రజలను బానిసత్వం విడుదల చేస్తుంది. ప్రజలను స్వయంగా ఆలోచించేలా చేస్తుందని, అలాగే వారి అర్హత పై నిలబడేలా చేస్తుంది” అని రాశారు.
End of Article