Home Off Beat ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక…పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.

ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక…పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.

by Sainath Gopi

Ads

శ్రీరస్తు-శుభమస్తు-ఆశీర్వమస్తు అని ప్రస్తుత పెళ్లి ఆహ్వాన పత్రికలో చూస్తుంటాం దానికి భిన్నంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక చూస్తే అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుస్తుంది.

Video Advertisement

]మే 9, 1946 న ప్రచురించిన ఈ పత్రికలో ‘శ్రీరస్తు-శుభమస్తు-అవిఘ్నమస్తు’ అని ఉండాల్సిన చోట, ‘శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం’ అనే జాతీయోధ్యమ నినాదాలతో ఆ పత్రికను ముద్రించారు.

ఆహ్వాన పత్రిక మొదటి లైన్ లో ‘వందేమాతరం’ అనే జాతీయోద్యమ నినాదానం చూస్తుంటే 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశ ప్రమేయం, ఆ పరిస్థితుల్లో దేశంలోని పౌరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఆహ్వాన పత్రిక చివర్లో ‘దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపాలని కోరుచున్నాం’ అనే లైన్ చూస్తుంటే, ఆ సమయంలో ఆర్థిక పరిస్థితి ,నిత్యవసరాల కొరత వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.. తాడంకి గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో ఇలా పెళ్లి పత్రకను ముద్రించి బంధువుల్ని, స్నేహితుల్ని ఆహ్వానించారు.

freedom in india

ఈ పెళ్లి పత్రిక మీద కనకమేడల సుబ్బయ్య అనే వ్యక్తి తన సోదరుడు పెళ్లికి పిలుస్తున్నట్లు ఉంది. సోదరుడు శ్రీరాములు అలాగే ఎలమంచి సుబ్బయ్య గారి కూతురు అయిన కృపావతి పెళ్లి చేసుకుంటున్నారు అని ఇందులో రాసి ఉంది. ఈ పెళ్లి ఆహ్వాన పత్రిక ఇన్ని సంవత్సరాల తర్వాత బయటికి వచ్చింది. ఇదంతా చూస్తుంటే నిజంగా అప్పటి పరిస్థితి ఎలా ఉందో అని అనిపిస్తుంది.

freedom in india

అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి రావడానికి, అలాగే మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి అప్పుడు ఉన్న సంఘసంస్కర్తలు అలాగే స్వతంత్ర పౌరులు మన కోసం ఎంత పోరాడారో, ఎంత మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారో ఇప్పటికీ గుర్తుతెచ్చుకుంటూనే ఉన్నాం. అప్పుడు కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు ఆలోచన విధానం ఇంకా మిగిలిన విషయాల్లో కూడా ప్రజలలో మార్పు తేవడానికి చాలామంది కృషి చేశారు. వారి వల్ల ప్రజల ఆలోచనా తీరు కూడా చాలా మారింది. వారిని ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నాం.


End of Article

You may also like