Ads
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు అనుకునే లోపు థాంక్యూ ద్వారా మరో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు.
Video Advertisement
ఇక ఇప్పుడు కస్టడీ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు చై. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమాలో నాగచైతన్య శివ అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమా మే 12న గ్రాండ్‌గా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర బృందం. అయితే తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. కొన్ని కట్స్ కూడా సూచించినట్లు తెలుస్తోంది.
ఇక సినిమా టాక్ విషయానికొస్తే.. మూవీ సెకండాఫ్ చాలా బాగా వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు సెన్సార్ బృందం ప్రశంసలు కురిపించిందట. ఇక మరోవైపు థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు వెంకట్ ప్రభు.. ఆయన తమిళ్ లో మంచి హిట్స్ ఇచ్చాడు, అవి తెలుగులో కూడా క్లిక్ అయ్యాయి. ఇప్పుడు తన అనుభవం మొత్తాన్ని వాడి, కస్టడీ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ దర్శకుడు.
ఈ మూవీ లో నాగచైతన్య లుక్ కూడా కొత్తగా, చాలా నేచురల్‌గా కనిపించింది. ఇక చాలా కాలం తర్వాత కృతికి మంచి పాత్ర పడ్డట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి .. ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. అలాగే కీలక పాత్రల్లో శరత్ కమార్, అరవింద్ స్వామి నటించారు. ఈ చిత్రానికి ‘మ్యూజిక్ మ్యాస్ట్రో’ ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.
Also read: “ఇదేదో హిట్ అయ్యేలాగే ఉంది కదా..? అంటూ… నాగ చైతన్య “కస్టడీ” ట్రైలర్‌పై 10 మీమ్స్..!
End of Article