Ads
ఐపీఎల్-16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించి చెన్నై లక్ష్యాన్ని 171 పరుగులుగా ఖరారు చేశారు. ఈ లక్ష్యాన్ని చెన్నై చివరి బంతికి ఛేదించింది.
Video Advertisement
ఎంఎస్ ధోని విఫలం అయినా.. చివరి మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు గేమ్ చేంజర్ గా మారాడు. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. తొలి నాలుగు బంతులకు మోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో చివరి రెండు బంతులకు 10 పరుగులు అవసరం కాగా.. ఐదో బంతిని జడేజా సిక్సర్ బాదాడు. ఇక చివరి బంతిని ఫైన్ లెగ్ దిశలో బౌండరీ బాదిన జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కు 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని అందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. తర్వాత చెన్నై బాటింగ్ స్టార్ట్ చేసి 3 బాల్స్ ఆడగానే భారీ వర్షం పడింది. అనంతరం తడి పిచ్ కారణంగా మ్యాచ్ దాదాపుగా గంటన్నర సేపు ఆగింది. దాంతో అంపైర్లు చెన్నై టార్గెట్ ను 15 ఓవర్లకు 171 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్ ను సరిగ్గా 15 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించి ఐదోసారి చాంపియన్ గా నిలిచింది.
గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. యువ ప్లేయర్ సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్ తో మెరిశాడు. త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
భారీ లక్ష్యం, మధ్యలో వరుణుడి అడ్డంకి.. ఇక ట్రోఫీ గుజరాత్ కే అనుకున్నారంతా.. కానీ తన అనుభవాన్నంతా రంగరించి చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు ధోని.
ఇక ఉత్కంఠ భరితం గా సాగిన ఈ ఫైనల్ పై నెట్టింట పలు మీమ్స్ విరాళ వుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article