Ads
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ప్రపంచంలోని రిచెస్ట్ పీపుల్ లిస్ట్ లో కూడా ఉన్నత స్థానం కలిగి ఉన్నాడు. అపార సంపదకు ఓనర్ అయిన ముఖేష్ అంబానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సాధారణంగా ఉంటారు.
Video Advertisement
ఆయన తరచూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ఆయన పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తరచు వైరల్ అవుతుంటాయి. అయితే ముఖేష్ అంబానీ తరచుగా ఒక దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. అది ఏమిటో ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం..
ముఖేష్ అంబానీ దేశంలోని చాలా పుణ్యక్షేత్రాలకు తరచూగా వెళుతుంటారు. అయితే ఈ దేవాలయాలలో ఒకటైన నాథద్వారాలో ఉన్న శ్రీనాథ్ దేవాలయం. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి చాలాకాలం నుండి ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఈ దేవాలయాన్ని అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్టుడు శ్రీనాథుడు అవతారంలో కొలువై వున్నాడు.
17వ శతాబ్ధంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మహారాజా రాజాసింగ్ ఈ ఆలయాన్ని కట్టించారు. శ్రీనాథ్ ఆలయానికి విశాలమైన ప్రాంగణం ఉంది. ఆలయంలోనికి వెళ్లేందుకు నాలుగు వైపులా ద్వారాలు నిర్మించి ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీనాథుడు శ్యామల వర్ణంలో కనిపిస్తాడు. ఈ ఆలయానికి రాజస్థాన్‌కు ప్రజలు తరచూగా వస్తుంటారు. హోలీ పండుగ రోజు ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఆలయం జనంతో నిండిపోతుంది.
ఈ త్రినాథ్ ఆలయాన్ని సందర్శిస్తే భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని అంటారు. ఇక ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ నాథద్వారా ఉదయపూర్ కు దగ్గరగా ఉంది. నాథద్వారాకు ట్రైన్ లేదా విమానంలో ఉదయ్‌పూర్ వరకు వెళ్ళి, అక్కడి నుండి త్రినాథ్ ఆలయానికి వెళ్లవచ్చు.
Also Read: ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో తెలుసా..? ద్రౌపది గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
End of Article