Ads
సినిమా వాళ్ళ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. అలాగే వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలి అనుకుంటారు అభిమానులు. అయితే పెళ్లి లాంటి పెద్ద విషయాలు తెలిసినప్పుడు డిస్కషన్ మామూలుగా జరగదు. ఇది మాత్రం సినిమా ప్రియులే కాకుండా మామూలు ప్రజలు కూడా చర్చించుకునే విషయం.
Video Advertisement
ఎంత సీక్రెట్గా ఉంచాలి అనుకున్నా.. సెలెబ్రెటీల వార్తలు బయటకు వస్తూనే ఉంటాయి. అలాంటిది వారి పెళ్లి విషయాలు చాలా వైరల్ అవుతాయి. సెలబ్రెటీల పెళ్లి అంటే.. అబ్బో.. హడావుడి అంతా.. ఇంతా.. కాదు. వాళ్లు వేసుకున్న డ్రస్సుల దగ్గర నుండి, డెకరేషన్ ఎలా ఉంది, ఎంతమంది వచ్చారు, కొన్నిసార్లయితే వాళ్లు తినడానికి మెనూ ఏం పెట్టారు లాంటి విషయాలు కూడా బయటకు వస్తాయి.
ఇంతగా పాకుతుంది అని సెలబ్రెటీలు జాగ్రత్తపడి ఆడంబరంగా చేసుకోకపోయినా, మీడియా పుణ్యమా అని అక్కడ జరిగే ప్రతి ఒక్క విశేషం అందరికీ తెలుస్తూనే ఉంటుంది. సెలబ్రిటీకి పెళ్ళంటే అబ్బో తమ ఇంట్లో పెళ్లి అన్నట్టుగా మురిసిపోతారు అభిమానులు. అయితే ఈ పెళ్ళి వేడుకను సెలబ్రిటీలు లైవ్ లో చూస్తే, ఆ సెలబ్రిటీలందరినీ ఒకే చోట చూస్తూ పెళ్లి వేడుకను లైవ్ టెలికాస్ట్ లో ఎంజాయ్ చేసేది ప్రేక్షకాభిమానులు.
వీటితో పాటు ముఖ్యమైనది వెడ్డింగ్ కార్డు. ఒక పెళ్లి ఎక్కడ.. ఎప్పుడు జరుగుతుంది. ఆ టైం కి వంటి వాటిని తెలుపుతూ.. అందర్నీ పెళ్ళికి ఆహ్వానిస్తారు. ఇక సెలబ్రిటీల పెళ్లిపత్రికల గురించి ఐతే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానుల కోసం సోషల్ మీడియాలో పెళ్లిపత్రికలను పోస్ట్ చేసి సంతోషపరుస్తారు సెలబ్రిటీలు.
ఈ మధ్య పెళ్లిపత్రికలను చాలా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయిస్తున్నారు. పెళ్లిపత్రిక బట్టి పెళ్లి ఎంత గ్రాండ్ గా జరగబోతుందో అనేది చెప్పవచ్చు.అందుకే మా ఇంట పెళ్లి, పండుగలా జరగబోతుంది, రండి సంబరాలు చేసుకుందాం అన్నట్టు డిజైన్ చేయిస్తున్నారు. మరి మన తెలుగు సెలబ్రిటీల పెళ్లిపత్రికలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
#1 శర్వానంద్ – రక్షిత
#2 నిహారిక – చైతన్య
#3 ప్రణీత – నితిన్
#4 నిఖిల్ – పల్లవి
#5 కార్తీ – రంజిని
#6 నయనతార – విగ్నేష్ శివన్
#7 కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా
#8 నాగ శౌర్య – అనూష
Also read: ఈ 11 మంది నటులు ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా.?
End of Article