Ads
ఇటీవల కాలంలో మహిళలు పెళ్లి తర్వాత తల్లి అవడాన్ని రెండు మూడేళ్ళ పాటు వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత తల్లి కావడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. కానీ లేట్ వయసులో గర్భధారణ వల్ల చాలా దుష్ప్రయోజనాలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Video Advertisement
ఉన్నత చదువు, కెరీర్ ఎదుగుదల, మానసిక ఒత్తిడి లాంటి కారణాలతో ఎంతోమంది స్త్రీలు గర్భధారణను వాయిదా వేస్తున్నారు. అలా చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉంటున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరి ప్రాముఖ్యత ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి అభిప్రాయాలు కూడా వేరేగా ఉంటున్నాయి. అసలు తల్లి కావడానికి సరైన వయస్సు ఏమిటి? లేట్ వయసులో తల్లి అయితే ఎదురయ్యే సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తల్లి కావడం కోసం సరి అయిన వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య గర్భధారణ మంచిదని గైనకాలజిస్టు డాక్టర్ నందినీ పాల్‌షేత్కర్ అన్నారు. అయితే 35 సంవత్సరాల తర్వాత తల్లి అయితే చాలా సమస్యలు ఎదురవుతాయని, అందుకే 25 నుంచి 35 సంవత్సరాలు గర్భధారణ సరైన వయసని ఆమె చెప్పారు.వయసు మహిళల్లో అండాల సంఖ్య మీద ప్రభావం చూపిస్తుంది. ఇక వయసు పెరుగుతున్నకొద్ది మహిళల్లో అండాల సంఖ్య తగ్గుతుందని ఎన్నో పరిశోధనల్లో తెలిసింది. పురుషుల్లో శుక్రకణాలు రోజూ ఉత్పత్తి అవుతుంటాయి. అయితే మహిళల్లో పది లక్షల అండాలు మాత్రమే ఉంటాయి. రజస్వల అయ్యే టైంకి అండాలు సంఖ్య 3,00,000 పరిమితం అవుతుంది. 37 సంవత్సరాలకు మహిళల్లో అండాల సంఖ్య 25,000కు తగ్గుతాయి. 51 సంవత్సరాలకు అండాల సంఖ్య 1000 మాత్రమే.
వయసు పెరుగుతున్నకొద్ది అండాల సంఖ్య తగ్గడం మాత్రమే కాకుండా అండాల నాణ్యత తగ్గిపోతుంది. ఆలస్యంగా తల్లి కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల ఆ ప్రభావం తల్లి పైన, బిడ్డ పైన దుష్ప్రభావం పడుతుంది. మొదటి ముడు నెలలు అబార్షన్స్ ఎక్కువగా అవుతుంటాయి. డయాబెటిస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.
Also Read: మీరు మందులు వేసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా..? అయితే మందులు పనిచేయవట.!
End of Article