పంటి నొప్పి తో బాధ పడుతున్నారా ఈ చిట్కాలు పాటించండి

పంటి నొప్పి తో బాధ పడుతున్నారా ఈ చిట్కాలు పాటించండి

by Megha Varna

Ads

మనలో చాలా మందికి అప్పుడప్పుడు  పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు.పంటినొప్పికి ప్రధాన కారణం ఒకరకమైన బ్యాక్టీరియా. ఇది యాసిడ్‌ను ఉత్పత్తి చేసి టూత్ ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా నొప్పి మొదలవుతుంది.

Video Advertisement

సాధారణంగా నోట్లో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా దంతాలపై ఒక గారలాంటి దాన్ని ఏర్పాటు చేస్తుంది. దాన్ని ప్లేక్‌ అంటారు. ఈ ప్లేక్‌లో సలైవా, ఫుడ్‌, ఇతర సహజమైన పదార్థాలుంటాయి.

సాధారణంగా ఇలాంటి ప్లేక్స్‌ దంతాల మధ్యన ఏర్పడుతుంటాయి. కావిటీస్‌ వల్ల పంటి నొప్పి వచ్చినట్లయితే ఎనామిల్‌ దెబ్బతిన్నదని అర్థం. ఒకసారి దెబ్బతింటే తిరిగి పూర్వస్థితి పొందడం సాధ్యం కాదు. పల్సైటిస్‌ వల్ల కూడా పంటి నొప్పి వస్తుంది. పల్సైటిస్‌ అంటే పన్ను పుచ్చిపోతుంది. ఇది నర్వ్‌ వరకు వెళుతుంది. గమ్‌ప్రాబ్లమ్స్‌ కూడా దంతాల నొప్పులకు కారణమవుతాయి. దంతాల మధ్యన ఆహారపదార్థాలు ఇరుక్కుపోవడం వల్ల గమ్‌ప్రాబ్లమ్స్‌ మొదలవుతాయి. దీర్ఘకాలంలో ఇది పంటినొప్పిని కలిగిస్తాయి. పంటినొప్పికి అల్సర్‌ కూడా కారణం కావచ్చు. కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు, అల్సర్లు కూడా నొప్పికి కారణమవుతాయి.పంటి నొప్పి నివారణకు ఇంట్లో చేసే పరిష్కారాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఉత్తమమైన పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలుసుకొందాం.

1) జామ ఆకులలో యాంటీఇన్ ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. పంటి నొప్పితో బాధపడేవారు రెండు లేక మూడు జామ ఆకుల్ని శుభ్రంగా కడిగి తినటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

2) వెల్లుల్లి, లవంగంలను తీసుకొని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే దాని నుండి వచ్చే రసం వల్ల పది సెకన్లలోనే నొప్పి తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఉన్న నొప్పులను కూడా తగ్గిస్తుంది.
3) పచ్చి ఉల్లిపాయ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉండుట వల్ల దానిని 3 నిముషాలు నమిలితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. నములుట కష్టంగా ఉంటే అప్పుడే కోసిన ఉల్లిపాయ ముక్కను పెట్టుకోవచ్చు.
4) వెల్లుల్లిలో యాంటీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి దానికి చిటికెడు మెత్తని ఉప్పును కలిపి పుచ్చిపంటిపై పెడితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
5) అరస్పూన్ లవంగాలు, కొద్దిగా కొబ్బరినూనె, టీస్పూన్ మిరియాలపొడి, చిటికెడు ఉప్పు వీటిని అన్నింటిని కలిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయం అవుతుంది.

End of Article

You may also like