Ads
హస్తసాముద్రిక శాస్త్ర ప్రకారం, అరచేతిలోని రేఖలను బట్టి, అరచేతిలో ఉండే గుర్తులు శంఖు, చతురస్రాలు, త్రికోణం, చక్రాలు, స్టార్స్ ను బట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అరచేయి ఆకారాన్ని, చేతివేళ్ళ పొడవును బట్టి కూడా ఒక వ్యక్తి పర్సనాలిటిని తెలుసుకోవచ్చని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Video Advertisement
హస్తసాముద్రిక శాస్త్రంలో అరచేయి ఆకారాన్ని బట్టి నాలుగు రకాలు ఉన్నాయి. అవి ఏమిటో? వాటి పేర్లు ఏమిటో? వారి వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. 1. ఎర్త్ హ్యాండ్:
అరచేయి చతురస్రాకారంలో ఉండి, చేతి వేళ్ళు ఆకారంలో చిన్నగా ఉంటే మీరు లాజికల్ గా ఆలోచిస్తారని, ప్రాక్టికల్ గా పని చేస్తారని, డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు. ఈ చేయి కలిగిన వారు వీరికి వచ్చే సమస్యలను లాజికల్ గా సాల్వ్ చేసుకుంటారు. ఎవరి మాట వినరు.
2. ఫైర్ హ్యాండ్:
అరచేయి దీర్ఘ చతురస్రాకారంలో ఉండి, చేతి వేళ్ళు చిన్నగా ఉంటే అది ఫైర్ హ్యాండ్. వీరు ఉద్వేగభరితమైన, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు. వీరు కష్టపడి పనిచేస్తారు. వారు అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు.
3. ఎయిర్ హ్యాండ్:
అరచేయి నలు చదరంగ ఉండి, చేతి వేళ్ళు పొడవుగా ఉంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు అర్ధం. విశ్లేషణాత్మక సామర్థ్యాలు కలిగి ఉంటారు. మేధోపరమైన ఆసక్తిగల వ్యక్తులుగా ఉంటారు. అలాగే త్వరగా తికమక పడిపోయే వ్యక్తి కూడా. దృష్టి మారిపోతుంటుంది.
4. వాటర్ హ్యాండ్:
అరచేయి పొడవుగా ఉండి, చేతి వేళ్ళు కూడా పొడవుగా ఉంటే మీది వాటర్ హ్యాండ్. వీరు అతి సున్నితమైన మనసు కలవారని అర్ధం. ఇతరుల మాటకు వెంటనే బాధపడిపోతారు. ఈ నాలుగు హ్యాండ్స్ లో ఎవరు బెస్ట్ అంటే అరచేయి ఎయిర్ మరియు ఫైర్ రకాలకు చెందినవారు. వీరికి చేసే పనుల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అర్ధం. వీరి శక్తి సామర్ధ్యాలకు తిరుగు ఉండదు. ఎంతో ఉన్నతమైన విజయాలను అందుకుంటారు.
Also Read: మీ చేతి మీద ఇలాంటి గుర్తు ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!
End of Article