Ads
ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్టుగా ప్రతి మనిషి వ్యక్తిత్వం లో వ్యత్యాసాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో వాళ్ళు ప్రవర్తించే తీరు అలాగే స్నేహితులతో ఉండే వైఖరి వేరుగా ఉంటుంది. వృత్తిపరంగా మరోరకంగా ఉంటారు. ఇలా వాళ్లు పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రవృత్తిని మార్చుకుంటారు కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని చెప్పడం కొన్ని సందర్భాలలో చాలా కష్టంగా ఉంటుంది.
Video Advertisement
అయితే జన్మ నక్షత్రాలు మరియు రాసిని బట్టి కొందరు ప్రవృత్తిని తెలుసుకోవడం సాధ్యపడుతుంది అని అంటారు. రాశిచిత్రం ముఖ్యంగా మనిషి యొక్క ప్రవర్తనను, స్వభావాన్ని తెలియపరుస్తుంది. ఇది కొందరు నమ్ముతారు కానీ కొందరు ఇది సాధ్యపడదు అని వాదిస్తారు కూడా. ఏదిఏమైనాప్పటికీ జన్మరాశి మనిషి యొక్క జీవన విధానాన్ని చాలా వరకు తెలియపరుస్తుంది.
ముఖ్యంగా కొన్ని రాశులలో జన్మించిన స్త్రీలకు భర్తలను అనుమానించే లక్షణం కాస్త ఎక్కువగా ఉంటుంది. వీరికి జీవితం పై సంతృప్తి శాతం చాలా తక్కువ. తమ భర్త యొక్క స్నేహితులు ,కలిసి పనిచేసేవారు ఇలా చాలామంది గురించి ఆరా తీయడం వీళ్లకు ఓ ప్రత్యేకమైన హాబీ అని చెప్పవచ్చు. ఇటువంటి లక్షణాలు ఎక్కువగా మనం మేష, వృషభ మరియు ధనుస్సు రాశుల మహిళలలో గమనించవచ్చు.
#1 మేష రాశి స్త్రీలు బాధ్యతాయుతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు మంచి డిటెక్టివ్ గా రాణిస్తారు. కొన్నిసార్లు హద్దులు దాటిన వీరి వచ్చు కదా అవతరి వారి మనోభావాలను దెబ్బతీస్తుంది. భర్త ఆలోచనలను తెలుసుకోవాలి అనుకునే కుతూహలం వీళ్లకు చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇబ్బందుల్లో పెడుతుంది.
#2 వృషభ రాశి మహిళలు స్నేహితులకు ఎక్కువ నమ్మకస్తులుగా ఉంటారు కానీ అవతలి వారి నుంచి సమాచారాన్ని రాబట్టడానికి వీరు శతవిధాలా ప్రయత్నిస్తారు. భాగస్వామిపై డేగలా నిఘా వేయడమే కాకుండా ,మొబైల్స్, ఈమెయిల్, మెసేజెస్ ఇలా అన్ని వెతికి మరి చదువుతారు.
#3 ధనుస్సు రాశి మహిళలకు అనుమానం కాస్త ఎక్కువనే చెప్పవచ్చు .ఈ గుణం వల్ల వాళ్ళు తమ చుట్టూ ఉన్న వారిని ఎప్పుడూ అనుమానిస్తూనే బతుకుతారు. తమ భర్తకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి వీరు అనేక రకమైన వ్యక్తులను వాడడానికి కూడా ఆలోచించరు.
అంతేకాదు మీరు అనుకున్న సమాచారం వీరికి సకాలంలో అందకపోయినా ,ఏ కాస్త అవతలి వ్యక్తి నుంచి ఇబ్బంది ఎదురైనా వీళ్లు రచ్చ చేస్తారు.
End of Article