Ads
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫేమస్ ప్రాంతాలలో తెనాలి ఒకటి. తెనాలి ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధి చెందింది. వికటకవి గార్లపాటి రామలింగం సొంత పేరుతో కాకుండా తెనాలి రామకృష్ణుడిగా ప్రసిద్ధి చెందాడు. తెనాలి ఇంటిపేరు కానప్పటికీ తన ప్రతిభతో, తెనాలి పేరును నలువైపులా చాటారు.
Video Advertisement
తెనాలిని ఆంధ్రా పారిస్ అని అంటారు. తెనాలి గురించి తెలిసిన వాళ్ళు ఈ విషయం గురించి చెప్తూ ఉంటారు. అయితే తెనాలికి ఆంధ్రా పారిస్ గా ఎందుకు పిలుస్తారో చాలా మందికి తెలియదు. తెనాలికి ఆంధ్రా ప్యారిస్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ఒక యూజర్ ఇచ్చిన ఆన్సర్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కోరాలో “తెనాలికి ఆంధ్రా పారిస్ అనే పేరు ఎందుకు వచ్చింది?” అడిగిన ప్రశ్నకు రఘు. ఎం అనే యూజర్ ఈ విధంగా సమాధానం చెప్పాడు. ‘నాకున్న ఇదే సందేహానికి యాక్టర్ సాయికుమార్ హోస్ట్ గా ‘ఈటీవీ’ లో ప్రసారం అవుతున్న ‘వావ్’ కార్యక్రమంలో సమాధానం చెప్పారు. ఎన్నో శతాబ్దాలుగా పారిస్ కళలకు ప్రసిద్ధి చెందింది. అక్కడి స్టేజి డ్రామాలు, నాటక ప్రదర్శనలు చూడడం కోసం కళాప్రియులు వేరే ప్రాంతాల నుండి, వేరే దేశాల నుండి తరలి వస్తుండేవారు. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి కూడా ప్రాచీన కాలంలో పారిస్ లాగే కళలకు నెలవుగా ఉండేది.
ఆరోజుల్లో ఈ విషయం గమనించిన ఆంధ్రాలో ఉండే బ్రిటిష్ కళాప్రియులు తెనాలిని ‘ఆంధ్రా పారిస్’ అని పిలిచే వారని అర్ధం అయ్యింది. తెనాలి ఒక ప్రాచీన చారిత్రక నగరం. తెనాలి పూర్వం కాలం నుండి కళలకు పుట్టిల్లు. ఎందరో కవులను, పండితులను, కళాకారులను ఇచ్చిన కళాకేంద్రం. శ్రీకృష్ణదేవరాయలవారి అష్టదిగ్గజ కవులలో ఒకరిగా ప్రసిద్ది చెందిన వికటకవి తెనాలి రామకృష్ణుడి గురించి అందరికి తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమలో తొలి హీరో గోవిందరాజుల సుబ్బారావుగారు, తొలి హీరోయిన్ కాంచనమాల కూడా తెనాలి వారే. కృష్ణ, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమున, శారద, జగ్గయ్య, రమాప్రభ, దివ్యవాణి, ఎవియస్, శివపార్వతి లాంటివారు చాలా మంది తెనాలి, తెనాలి చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి వచ్చినవారే’ అని వివరించారు.
Also Read: ఈ ఆరేళ్ల పిల్లాడి టైం టేబుల్ చూసారా..? చదువుకునే టైం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article