Ads
చెడుపై మంచి సాధించిన విజయాన్ని, రాముడి చేతిలో రావణుడి పరాజయంగా దసరా జరుపుకుంటారు. కానీ శ్రీలంకలో రావణుడు ఇప్పటికీ కూడా శివభక్తుడిగా, సమర్థుడైన రాజుగా, సాటి లేని పండితుడిగా, రావణ్‌హట్ట అనే సంగీత వాయిద్యం మాస్ట్రోగా, అపర మేధావిగా ఆరాధించబడుతున్నాడు.
Video Advertisement
రావణుడి పాలనలో లంక బంగారు నగరంగా విలసిల్లింది. రావణ సంహితను రచించింది రావణుడే అని విశ్వసిస్తారు. అలాంటి గొప్ప జ్ఞాని, పడితుడు, రాజు అయిన రావణుడు ఇలా ఎందుకు మారాడో ఇప్పుడు చూద్దాం..
రావణుడు విష్ణువు కోసం ముల్లోకాలు వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడా విష్ణువు కనిపించడం లేదు. ఇక విష్ణువు తనేనే వెతుక్కుంటూ వచ్చేలా చేయాలనుకుంటాడు. విష్ణుమూర్తి ధర్మాన్ని పాటిస్తాడని రావణుడికి బాగా తెలుసు. ఎక్కడ చెడు ఉంటే అక్కడికి విష్ణుమూర్తి వస్తాడు. అందుకే తాను ఎప్పటిలాగే అధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఒక్క ఆలోచనే చరిత్రలో రావణుడు అంతే ఒక గొప్ప రాజు అని కాకుండా ఒక రాక్షసుడు అని ముద్ర పడేలా చేసింది. ఇక అంత్యంత హీనమైన పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అందమైన అమ్మాయిలు ఎక్కడ కనబడితే అక్కడ వారిని అనుభవించేవాడు. అలా ఒక రోజు వేదవతి అనే స్త్రీని బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె రావణుడి నుండి తప్పించుకు పారిపోయి నువ్వు నా వలనే మరణిస్తావు అని శాపం పెట్టి మంటల్లో దూకి చనిపోయింది. తరువాతి జన్మలో వేదవతి సీతాదేవిగా జన్మిస్తుంది. ఆ తరువాత ఇంద్రుని సభలో ఉండే రంభ తన నాట్యంతో అందరిని ఆకట్టుకుంది. అయితే రావణాసురుడు ఆమె అందాన్ని చూసి ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలని భావిస్తాడు.
అందరు చూస్తుండగానే తనతో గడపమని రంభ పై ఒత్తిడి చేస్తాడు. అందుకు రంభ అంగీకరించకపోవడంతో ఆమె వెంటపడి బలవంత పెడతాడు. అదే సమయంలో రంభ ప్రియుడు నలకుబేరుడు రావణాసురుడికి ఒక శాపం పెడతాడు. ఇష్టం లేకుండా ఏ స్త్రీని అయినా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెడతాడు. ఈ శాపం కారణంగా చేసేదేమి లేక రావణాసురుడు రంభ విషయంలో వెనక్కి తగ్గుతాడు. సీతమ్మను ఎత్తుకెళ్లిన తరువాత ఆమెను తాకకపోవడానికి ఇదే కారణం. ఆ తరువాత రాముడు రావణుడితో యుద్దం చేసి హత్యమార్చాడు.
Also Read: రావణుడి శవాన్ని చూసి ఏ భార్యా చెప్పని మాటలు చెప్పిన మండోదరి.. రావణుడి మరణానికి అసలు కారణం ఏంటంటే?
End of Article