Ads
పెళ్ళంటే నూరేళ్ళ పంట అని, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని పెద్దలు అంటుంటారు. పెళ్లి చేసుకున్న తరువాత జీవితాంతం వరకు సంతోషంలోనూ, దుఃఖంలోనూ ఒకరికొకరు తోడుగా భార్యాభర్తలిద్దరూ ఉండాలని చెబుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం సహకరించుకోవాలి.
Video Advertisement
భర్త ఉద్యోగం, భార్య ఉద్యోగం అనేవి ఉండవు. అందువల్ల స్త్రీ, పురుషులిద్దరూ వివాహం చేసుకునే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవడం ఇద్దరికి మంచిది. అయితే వివాహం చేసుకునే ముందు స్త్రీ, పురుషులు ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
#1 వంట చేయడం కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు సైతం చేయగలరు. కాబట్టి పెళ్లి చేసుకునే స్త్రీ, పురుషులిద్దరూ వంట చేయడం నేర్చుకుంటే మంచిది.
#2 వంటగదిలో ఉపయోగించే వస్తువుల పేర్లు, గృహోపకరణాలు, వాటి ఉపయోగాలు, వాడకం గురించి స్త్రీ, పురుషులిద్దరూ తెలుసుకుంటే మంచిది. గృహోపకరణాల లిస్ట్ ను తయారుచేసుకోవడం వల్ల నెలవారీ ఖర్చులను కంట్రోల్ లో ఉంచుకోవడానికి సాయం చేస్తుంది.
#3 కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు లాంటి నెలవారిగా ఉండే బిల్లులను ఎలా చెల్లించాలో పెళ్లికి ముందే స్త్రీ, పురుషులిద్దరూ తెలుసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆఖరి నిమిషంలో టెన్షన్‌ని పడాల్సిన అవసరం ఉండదు.
#4 పిల్లలను కనడం అనేది పర్సనల్ విషయం అయినప్పటికీ, పెళ్లికి ముందు, ప్రసూతి ఇబ్బందుల గురించి, పిల్లల పెంపకం గురించి, స్త్రీ, పురుషులిద్దరూ ప్రాథమిక విషయాలను తెలుసుకోవడం మంచిది.
#5 పెళ్లి తర్వాత వచ్చే సమస్యలను తల్లిదండ్రుల సహాయం లేకుండా ఒంటరిగా ఎలా ఎదుర్కోవాలో, ఎలా వాటిని అధిగమించాలనేది స్త్రీ, పురుషులిద్దరూ నేర్చుకోవడం మంచిది.
#6 పెళ్లి తరువాత స్త్రీకి తన గృహంలో ఉండే హక్కులు, అలాగే పుట్టిన ఇంటి పై ఉండే హక్కుల గురించి కూడా తెలుసుకోవడం మంచిది. స్త్రీ, పురుషులిద్దరూ భార్యాభర్తలకు సంబంధించిన చట్టాలు గురించి తెలుసుకుంటే మంచిది.
#7 వివాహం అనంతరం బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి డబ్బును పొదుపుగా ఖర్చు పెట్టడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం లాంటివి నేర్చుకుంటే మంచిది.
Also Read: ఈ ఆరేళ్ల పిల్లాడి టైం టేబుల్ చూసారా..? చదువుకునే టైం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article