Ads
శ్రావణ మాసం వచ్చిందంటే వ్రతాలు, పూజలు, శుభకార్యాలు చేసే మాసంగా భావిస్తారు. ఆషాఢ మాసం వెళ్ళగానే శ్రావణమాసం మొదటి రోజు నుండే ఇళ్లన్నీ ఆధ్యాత్మిక భావంతో నిండిపోతాయి. గృహాలన్నీ మామిడి తోరణాలతో, పసుపు రాసిన గడపలతో, పూజలతో స్త్రీలు బిజీగా ఉంటారు.
Video Advertisement
అలాంటి శ్రావణమాసం ఈ సంవత్సరం మరొకటి వచ్చింది. అదే అధిక శ్రావణమాసం. సాధారణంగా 12 నెలలు ఉంటాయి. కానీ 2023లో వచ్చిన అధిక శ్రావణమాసంతో కలిపి ఈ సంవత్సరం 13 నెలలు వచ్చాయి. మరి అధిక శ్రవణ మాసం ఏం చేయాలో? ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం.. ఈ ఏడాది అధిక శ్రావణమాసం జులై 18 నుండి ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఇక నిజ శ్రావణం ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. ఇక అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు. అధిక మాసంలో ముహూర్తాలు పెట్టి చేసే శుభకార్యాలు కొత్త షాపులను ప్రారంభించడం, గృహ ప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, పెళ్ళిళ్ళు, ఉపనయనం, సీమాంతం, వాస్తు పూజల వంటివి చేయకూడదని అంటారు. ఇక ఈ నెలలో చేయాల్సిన వాటిని తప్పనిసరిగా చేయాలి. అవి ఏమిటంటే పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు. ఆబ్దికం వంటి వాటిని మానకుండా బ్రహ్మణుడికి సమర్పించాల్సినవి చేయాలి. నిజ శ్రావణ మాసంలో సరి అయిన రీతిలో ఆబ్దికంను జరిపించాలి. అధిక మాసం కాబట్టి ఈ నెలలో ఏం చేసిన అధిక ఫలితాన్ని పొందుతారు.కాబట్టి జపాలు, తపాలు, నిత్యం చేసే పూజలు అధికంగా చేయడం. పారాయణం, తీర్థయాత్రలు, నది స్నానాలు, సముద్ర స్నానాలు వంటి పుణ్యకార్యాలను తప్పనిసరిగా చేసినట్లయితే మామూలు రోజుల కన్నా అధికమైన ఫలితం ఉంటుందని చెబుతారు.నిత్య పూజలు చేసేవారు మానకుండా అధిక మాసంలో కూడా కొనసాగించాలి. వరలక్ష్మి వ్రతం ను తప్పని సరిగా అధికమాసంలో చేసుకోవాలని లేదు. నిజ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.
Also Read: అధిక మాసం ఎందుకు వస్తుంది.? జ్యోతిష్య శాస్త్రం ఏముంటుంది? శుభ కార్యాలు ఎందుకు చేసుకోవద్దు..?
End of Article