అసలు కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది..? అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది..?

అసలు కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది..? అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది..?

by kavitha

Ads

హిందూ పురాణాల ప్రకారం ప్రతి యుగంలో ధర్మం తప్పినపుడు అధర్ములను సంహరించి యుగధర్మాన్ని రక్షించడానికి శ్రీమహా విష్ణువు వివిధ అవతారాలు ఎత్తి ధర్మస్థాపన చేశారు. కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీమహా విష్ణువు 9 అవతారాలు ఎత్తారు.

Video Advertisement

కృష్ణావతారం తరువాత ఈ  కలియుగంలో శ్రీమహా విష్ణువు కల్కి అవతారం ఎత్తి పాపులను శిక్షించి మరో యుగానికి నాంది పలుకుతారని పురాణాలు చెప్తున్నాయి. పదవ అవతారం అయిన కల్కి అవతారం దశావతారములలో ఒకటి. పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు.
kalki-avatarఅసలు యజ్ఞ యాగములు కనిపించవు. గోవులు విశేషంగా వధింపబడడం, గో మాంసం తినడం లోకంలో మొదలు అవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను పట్టించుకునే బిడ్డలు ఉండరు. భార్యభర్తలు ఒకరినొకరు  గౌరవించుకోవడం అనేది లోకంలో కనిపించదు. పురుషుల యొక్క ఆయుష్హు 18 ఏళ్లకే పూర్తి అవుతుంది. స్త్రీలు కేశాలు విరబోసుకోవడమే విశేషంగా పరిగణించబడి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. ఆ తరువాత లోకంలో పురుషులు 18 ఏళ్లకే మరణించడం మొదలవుతుంది. పురుషుల ఆయుర్థాలు క్షీణించిన సమయంలో “శంభాలా ” అనే గ్రామంలో విష్ణుయేశుడు అనే బ్రాహ్మణుని కడుపున కల్కి అనే పేరుతో మహావిష్ణువు పదవ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడంటే కలియుగం చిట్ట చివర్లో కృతయుగానికి మొదలవడానికి మధ్యలో ఆయన జన్మిస్తాడు. కల్కి అవతరించాడు అనేందుకు గుర్తు ఏమిటంటే పాపుల అందరికీ భంగధర జబ్బు వస్తుంది. అంటే ఆసనము నందు పుండ్లు వచ్చి రక్తం కారిపోతుంది. ఆ తరువాత వారికి వారే పురుగుల వలె రాలిపోతారు. అప్పుడు ఎక్కడ చూసినా కూడా వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములు అయినవారు ఎవరు ఉన్నారో వారు మాత్రమే తమ శరీరాలతో ఉంటారు. కల్కి తెల్లని గుర్రాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిన బలవంతులై రాజ్యాలు ఆక్రమించినవాళ్ళు, అధికారానికి తగిన అర్హత లేకపోయినా సింహాసనం పై కూర్చుని పాలన చేసే వారందరినీ సంహారిస్తాడు.

ఆ తరువాత కలియుగం పూర్తి అయ్యి, కృత యుగం మొదలవడానికి జల ప్రళయం వచ్చి, నీటితో భూమండలాన్ని ముంచేస్తుంది. ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం. కల్కి అవతారాన్ని ఒక్కసారి తలచుకున్నా, నమస్కరించినా కూడా పాపబుద్ధి తొలగిపోతుందని, కల్కి అవతారం అంతటి గొప్ప అవతారం అని పండితులు చెబుతున్నారు.

Also Read: అధిక శ్రావణ మాసంలో ఇలా చేయకండి..! ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన వాళ్ళు ఇది తప్పక తెలుసుకోండి..!


End of Article

You may also like