Ads
బొట్టు పెట్టుకోవడం అనేది భారతదేశ సంప్రదాయపు విశిష్టమైన లక్షణం. పురాతన కాలం నుండి మహిళలు నుదుటన బొట్టును పెట్టుకుంటున్నారు. అమ్మమ్మలు, నాయనమ్మలు అయితే కుంకుమతో పెద్దగా బొట్టు ధరించి, నిండుగా కనిపించేవారు. కాలంతో పాటుగా పెట్టుకునే బొట్టు సైజ్ కూడా మారిపోయింది.
Video Advertisement
కుంకుమ స్థానంలో స్టిక్కర్స్ వచ్చాయి. బొట్టు పెట్టుకున్నట్లయితే ముఖం వెలిగిపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అందంగా కనిపించడం కోసం కానీ, సంప్రదాయం కోసం కానీ బొట్టును పెట్టుకుంటారని భావిస్తారు. మహిళలు బొట్టు పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణురాలు డా. దీక్షా భావసర్ వెల్లడించారు.
యోగా ప్రకారంగా, స్త్రీలు బొట్టు పెట్టుకునే స్థలాన్ని అజ్ఞా చక్రం అని అంటారు. ఈ చక్రాన్ని మనిషి శరీరంలో 6వ, మరియు అత్యంత శక్తివంతమైన చక్రం. బొట్టు పెట్టుకునే సమయంలో ఈ పాయింట్‌ను రోజుకు అనేక సార్లు ప్రెస్ చేస్తుంటారు. శరీరంలో వేల సంఖ్యలో నాడులు ఉంటాయి. ఈ నాడులన్నిటికి కేంద్ర స్థానమే ఈ అజ్ఞా చక్రం. ఈ స్థానంలో కళ్లు, తల, పిట్యూటరీ గ్రంధి, మెదడుకి సంబంధించిన నాడులు ఉంటాయి.మహిళలు బొట్టు పెట్టుకునేప్పుడు లేదా స్టిక్కర్ పెట్టుకునే సమయంలో ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆజ్ఞా చక్రం పై ఒత్తిడి పడుతుంది. అప్పుడు నాడులు అన్నీ ఉత్తేజం అవుతాయి. ఇక పురుషులు బొట్టు పెట్టుకోరు. అందువల్ల వారు ఆ స్థానంలో కుంకుమను ధరించినా, లేదా వంద సార్లు ఆ స్థానాన్ని ప్రెస్ చేసినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ దీక్షా తెలిపారు. ఆ ప్రయోజనాలు ఏమిటంటే.. 1. తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
2.సైనస్‌లను క్లియర్ చేస్తుంది.
3. దృష్టి మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
5. డిప్రెషన్‌ను నివారిస్తుంది.
6. వినికిడిని మెరుగుపరుస్తుంది.
8. జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది.
9. అంతర్ దృష్టి మరియు అవగాహనను మెరుగుపరుస్తుంది.
10. ఒత్తిడితో కూడిన మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది.
https://www.instagram.com/reel/CrNP-a_IYM7/?utm_source=ig_embed&ig_rid=ffac44c6-6c26-4686-bd72-8614fc32df25
Also Read: మీ నాలుక రంగుని బట్టి మీకున్న అనారోగ్య సమస్యని గుర్తించచ్చు…ఎలాగో తెలుసా.?
End of Article