Balakrishna – Bobby Movie: బాబోయ్ బాలయ్యతో డైరెక్టర్ బాబీ పెద్ద ప్లాన్ వేశాడు… అదేంటో తెలుసా? 

Balakrishna – Bobby Movie: బాబోయ్ బాలయ్యతో డైరెక్టర్ బాబీ పెద్ద ప్లాన్ వేశాడు… అదేంటో తెలుసా? 

by Anudeep

Ads

వన్ టైం స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు. బాలయ్య వరుస సినిమాలు చేస్తూ నిజంగానే హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. అటు టాక్ షోలు చేస్తూ అందరినీ సరదాగా అలరించిన బాలయ్య… వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Video Advertisement

ప్రస్తుతం అనిల్ రావిపుడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాను అభిమానుల ముందుకు ఘనంగా అక్టోబర్ 19 కి తీసుకురానున్నారు. అర్జున్ రాంపాల్, శ్రీలిల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Balakrishna Next Movies

ఇదిలా ఉంటే బాలయ్యతో డైరెక్టర్ బాబీ అదిరిపోయే కథను రెడీ చేసుకున్నారు. ఈ మేరకు బాలయ్యకు కథను కూడా వినిపించగా… ఓకే చెప్పినట్టు సమాచారం. అంతే కాదు ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ తోనే అదరగొట్టేశారు అనే టాక్ కూడా వచ్చింది. దీంతో సినిమా తొలి దశలోనే అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమాతో ఎంతో బిజీగా ఉన్న బాలయ్య, వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పడంతో… బాలయ్య మంచి ఊపు మీద ఉన్నట్లు తెలుస్తోంది.

Balakrishna Bobby Movie

అయితే ఈ సినిమా మేకింగ్ కి ప్లానింగ్ మొదలు పెట్టగా… వచ్చే ఏడాది సమ్మర్ కల్లా విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకి సంయుక్తా మీనన్ ను బాలయన్న సరసన ప్రధాన పాత్రలో ఎంపిక చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాను ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు, బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ స్టోరీ కూడా నడపనున్నారు అట. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి, అలాగే బాలయ్య లుక్ ఈ సినిమాలో ఎలా ఉంటుందో అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి బాలయ్య వరుస సినిమాలతో పోటీ ఇస్తూ, దుమ్ము దులిపెస్తుంటే బాలయ్యా మజాకా అంటూ ఆయన అభిమానులు తొడలు కొడుతున్నారు అనుకోండి.

ALSO READ : నిఖిల్ స్పై అక్కడ బాగా క్లిక్ అయ్యింది… అసలు సంగతేంటో తెలుసా??


End of Article

You may also like