Spy Movie: నిఖిల్ స్పై అక్కడ బాగా క్లిక్ అయ్యింది… అసలు సంగతేంటో తెలుసా?? 

Spy Movie: నిఖిల్ స్పై అక్కడ బాగా క్లిక్ అయ్యింది… అసలు సంగతేంటో తెలుసా?? 

by Anudeep

Ads

నిఖిల్ సిద్ధార్థ్ మూవీ అనగానే కచ్చితంగా చూడాల్సిందే అనేలా చేసుకున్నాడు హీరో నిఖిల్. తను ఎంచుకునే కథలు, తీసే విధానం అందరినీ అలా కట్టిపడేస్తుంది. ఇక కార్తికేయ 2 అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో విజయ కేతనం ఎగురవేసింది. కానీ దాని తరువాత వచ్చిన స్పై మూవీ మాత్రం నిఖిల్ సిద్ధార్థ్ మూవీస్ అనే బ్రాండ్ పై ఉన్న అంచనాలను చేరుకోలేక పోయింది.

Video Advertisement

సినిమా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లు భారీగా అందుకోగా… రెండో రోజు నుండి కలెక్షన్ల గ్రాఫ్ అలా పడిపోతూ వచ్చింది.

spy movie review

ఇక ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. థియేటర్స్ లో అంచనాలను అందుకోలేక పోయినా ఓటీటీ లో మాత్రం విజయ పతాకం వైపు దూసుకు పోతుంది. ఇక్కడ మాత్రం అతి తక్కువ సమయంలో 100 మిలియన్ల 1 నిమిషానికి పైగా వాచ్ టైం ను దక్కించుకుంది. ఇప్పటి వరకు ఎక్కువ వ్యూవర్ షిప్ దక్కించుకున్న సినిమాల్లో ఈ సినిమా టాప్ ప్లేస్ లో నిలిచింది.

spy movie review

అయితే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా డబ్ వర్షన్ విడుదల అయినందున అధిక వీక్షకులను ఆకట్టుకుంటోంది. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర డీలా పడి, ఓటీటీలో ఒక్కసారిగా రాకెట్ లా దూసుకుపోతుంది నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై మూవీ. ఇక ఈ సినిమాలో నిఖిల్ సిద్దార్థ సరసన ఐశ్వర్య మీనన్ నటించగా… సాన్య ఠాకూర్, జిష్షు సేన్ గుప్తా, ఆర్యన్ రాజేశ్, మకరంద్ దేష్ పాండే, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పై కే. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.

ALSO READ : “ఇంటర్వెల్, క్లైమాక్స్ మార్చేశారు..!” అంటూ… “విజయ్” సినిమాపై రాజమౌళి పోస్ట్ చూశారా..?


End of Article

You may also like