Ads
కొందరు హీరోయిన్లు పెద్ద ఫేమస్ కాకపోయినా… చేసే ఒకటి రెండు సినిమాల్లోనే బాగా క్లిక్ అవుతారు. అలాంటి సమయంలో ఎన్నో అవకాశాలు కూడా వస్తుంటాయి. కానీ కొందరి అవకాశాలు చెయ్యి దాకా వచ్చి జారిపోతాయి.
Video Advertisement
అలా బ్రో, జెర్సీ సినిమాల్లో తన దగ్గర దాకా వచ్చి రెబా మోనికా జాన్ కి అవకాశాలు దూరం అయ్యాయి. దానికి కారణాలు ఏంటనే వివరాలకు వెళితే అసలు నిజాలు తెలుసాయి.
అయితే రేబా మోనికా జాన్ మొదట అనువాదం అయిన విజయ్ తళపతి సినిమాలో నటించింది. దాని తర్వాత ఇటీవల బ్రో విడుదలైన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి చెల్లెలి పాత్ర కోసం రెబాను టెస్ట్ చేశారట, ఓకేనా కాదా అన్నది మళ్లీ చెప్తాము అన్నారు కానీ ఏమైందో తనని తీసుకోలేదట అలా బ్రో సినిమాలో రెబాకు ఛాన్స్ మిస్ అయ్యింది. అంతక ముందు నాని సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర కోసం రెబాను అనుకున్నప్పటికీ… రెబాకు డేట్స్ కుదరక ఆ మూవీలో నటించే ఛాన్స్ మిస్ అయ్యింది.
అయితే బ్రో మూవీలో ఓకే కాకపోయినా… ఒకరోజు రెబా మేనేజర్ హాస్య మూవీస్ సంస్థ నిర్మాతలు స్నేహితులు కావడంతో వారి సంస్థకు వెళ్లారు. అప్పుడు అక్కడే ఉన్న దర్శకుడు అబ్బరాజు రెబాను సెల్ఫీ అడగ్గా… నేను మీకు తెలుసా అని రెబా అడిగిందట. దీంతో హా తెలుసు నిజానికి సామాజవరగణమన సినిమాకి మిమ్మల్నే అనుకున్నాము కానీ మీరు తెలుగు సినిమాలు చేయరేమో అని ప్రయత్నాలు వదులుకున్నాను.
కానీ ఈలోపు మీరే కలిశారు అని చెప్పారట. ఇక అనంతరం కథ వినగానే రెబాకు సినిమా నచ్చడంతో చిత్రీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో మంచి సుక్సెస్ తో నడుస్తోంది. ఒక ఛాన్స్ పోయినా ఇంకొక ఛాన్స్ వచ్చింది అని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ సర్ తో మళ్ళీ మూవీ చేసే అవకాశం వస్తే బాగుంటుంది, అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంటాను అని రెబా చెప్పుకొచ్చారు.
ALSO READ : “భగవంత్ కేసరి” లో శ్రీలీల క్యారెక్టర్ ఇలాగే ఉంటుందా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?
End of Article