“కండ్ల కలక” కి కారణం అయిన ఈ వైరస్ లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

“కండ్ల కలక” కి కారణం అయిన ఈ వైరస్ లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

by kavitha


వర్షాకాలం కావడంతో కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా కండ్లకలక కేసులు భారీగా పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

వాతావరణం తేమగా ఉండడం వల్ల బ్యాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాలలో కండ్లకలక కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మరి ఈ వైరస్ ఏమిటో ? లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..
వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల కలక వ్యాధి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వ్యాధి నాలుగు రకాలుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాక్టీరియా లేదా వైరస్, ఏదైనా ఫిజికల్ గాయం వల్ల లేదా ఎలర్జిక్ రియాక్షన్ వల్ల కూడా వస్తుంది. వర్షాకాలంలో బాక్టీరియా, వైరస్ లు పెరగడానికి అనువైన తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. దీనివల్ల ఇవి వేగంగా విస్తరిస్తాయి. కండ్లకలకను ఐ ఫ్లూ లేదా పింక్‌ ఐ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.
eyes 2ప్రస్తుతం వేగంగా కండ్ల కలక విస్తరిస్తున్న నేపథ్యంలో కంటి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ కండ్ల కలక లక్షణాలు అందరిలో ఒకేలాగా ఉండక పోవచ్చు.
ఒక్కొక్కరిలో ఒక్కొలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే అందరిలో కనిపించే కామన్ గా ఉండే లక్షణం అంటే జిగటగా ఉండే డిశ్చార్జ్‌ తో కళ్ళు ఎర్రగా మారుతాయి. కళ్ళు దురదగా అనిపించడం, కళ్ల నుంచి నీరు కారడం, లైట్ వెలుగును చూడలేకపోవడం, కళ్ళు తెరవలేకపోవడం, కళ్ల మంట, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కండ్ల కలక సోకినవారిలో కనిపిస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు: 

  • కండ్లకలక సోకితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులు కళ్ళను తరచూ మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది.
  • ఈ వ్యాధి వచ్చిన వారు ఇతరులకు దూరంగా ఉండాలి.
  • కండ్ల కలక వచ్చినవారు వాడిన వస్తువులు దిండ్లు, టవల్స్, వాష్‌క్లాత్‌లు, కంటి చుక్కలు, మేకప్ బ్రష్‌లు, కాంటాక్ట్ లెన్స్‌లు, కళ్లద్దాలు వంటివాటిని వేరేవారు ఉపయోగించకూడదు.
  • ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలి.
  • చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్ళను ముట్టుకోకూడదు.
  • సబ్బుతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • కండ్లకలక వల్ల కళ్లు దురదగా అనిపించినా రుద్దకూడదు.
  • కళ్ళు తుడవడనికి శుభ్రమైన కాటన్ క్లాత్ ఉపయోగించాలి.

Also Read: తలగడ పెట్టుకొని పడుకుంటున్నారా..? అలా చేస్తే వచ్చే నష్టాలు ఏంటో తెలుసా..?

You may also like