Varalakshmi Vratham 2023: వరలక్ష్మీ వ్రత విధానం మరియు విశిష్టత..!

Varalakshmi Vratham 2023: వరలక్ష్మీ వ్రత విధానం మరియు విశిష్టత..!

by kavitha

Ads

Varalakshmi Vratham 2023:  సౌరమానం ప్రకారం తెలుగు సంవత్సరంలోని ఐదవ నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా విశిష్టమైన శ్రావణ మాసంలో ప్రతిరోజూ పండగలాంటిదే. అయితే, ఈ మసానికి పరిపూర్ణతను చేకూర్చేది వరలక్ష్మీ వ్రతం.

Video Advertisement

Varalakshmi Vratham 2023 Images

Varalakshmi Vratham 2023 Images

Varalakshmi Vratham 2023: Images, Date  in Telugu

పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీమహావిష్ణువు భార్య అయిన మహాలక్ష్మీ ఎనిమిది రూపాలతో మానవాళి కోరికలు తీరుస్తూ, రక్షిస్తుంది. అయితే అష్టలక్ష్ములలో వరలక్ష్మీకి ఒక ప్రత్యేకత ఉందని చెబుతారు. వరలక్ష్మీ పూజ మిగిలిన లక్ష్మీ పూజల కన్నా శ్రేష్ఠమైనది అని శాస్త్ర వచనం చెబుతుంది.
శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసంలో, విష్ణువు జన్మనక్షత్రం అయిన శ్రవణం పేరుతో ఉన్న ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. వరాలను ఒసగే దేవతగా వరలక్ష్మీని కొలుస్తారు. సకలాభీష్టాలకోసం, సర్వమంగళ సంప్రాప్తి కోసం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని పెళ్లి అయిన స్త్రీలు ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తారు. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ పద్ధతుల్లో చేస్తారు. పద్ధతులు  ఏవైనప్పటికీ అందరూ లక్ష్మిదేవినిని కొలిచే విధానం మాత్రం ఒక్కటే.
వరలక్ష్మీ వ్రతం రోజున అనగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తెల్లవారుజామునే అభ్యంగన స్నానాన్ని చేయాలి. ఆ తరువాత గృహంలో ఈశాన్య భాగంలో ఆవుపేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టాలి. ఆ తరువాత  మండపాన్ని ఏర్పాటు చేసి, అందులో కొత్తబియ్యం పోసి చక్కగా తీర్చిదిద్ది, ఆ బియ్యం మధ్యలో కలశాన్ని పెట్టి,  మామిడి, మర్రి,  మేడి, రావి, జువ్వి చిగుళ్లను కలశంలో వేయాలి. తరువాత ఆ కలశం పై కొబ్బరికాయను పెట్టి, ఎర్రని రంగు రవిక గుడ్డతో అలంకరించాలి.
ముందుగా పసుపుతో గణపతికిపూజా చేసి, ఆ తరువాత ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి, వరలక్ష్మీ దేవతను ఆవాహన చేయాలి. వరలక్ష్మీ కీర్తిస్తూ షోడశోపచారాలు, అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అనంతరం దీప, దూప, నైవేద్యాలను తాంబూలాలని వరలక్ష్మీ దేవికి సమర్పించాలి. ఆ తరువాత కర్పూర నీరాజనం, మరియు  మంత్రపుష్పం సమర్పించాలి.
మంగళహారతి ఇచ్చిన తరువాత తోరగ్రంథి పూజ చేయాలి. తోరబంధన మంత్రం చెప్తూ ఆ తోరణాన్ని కుడిచేతికి కట్టుకొవాలి. తొమ్మిది రకాల పిండివంటలు, పండ్లు  మొదలగు వాటిని వరలక్ష్మీ దేవికి సమర్పించిన తరువాత, చివరగా ఒక ముత్తైదువకు వాయనదాన మంత్రం చెబుతూ తాంబూలం సమర్పిస్తూ ఆ ముత్తైదువను శ్రీ మహాలక్ష్మీగా భావించి వాయనం ఇచ్చి, ఆశీర్వాదం తీసుకోవాలి.

Also Read:  శివ పార్వతులకు ముగ్గురు కూతుర్లు ఉన్నారన్న సంగతి తెలుసా..? పద్మ పురాణంలో వారి గురించి ఏమి చెప్పారంటే..?

 


End of Article

You may also like