Ads
కెరటం నా ఆదర్శం… లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు.. అని అన్నారు స్వామి వివేకానంద. ఎంతో మందికి వివేకానంద ఆదర్శం. ఆయన నడిచిన మార్గం అద్భుతం. ఆయన నేటికీ నిదర్శనం. భారతదేశాన్ని జాగృతము చేసారు వివేకానంద. అదే విధంగా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను ఆయన ఉపన్యాసములతో.. వాదనలతో పరిచయం చేసారు.
Video Advertisement
ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు అయిన స్వామి వివేకానంద జనవరి 12, 1863 న జన్మించారు. జూలై 4, 1902 న మృతి చెందారు. అయితే ఈయన మరణం వెనుక వుండే నిజాలు గురించి చాలా మందికి తెలియవు. మరి ఆయన మరణం గురించి ఆ నిజాలు గురించి చూద్దాం.
నిజానికి చాలా మందికి స్వామి వివేకానంద ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు అనేది తెలియదు. మరి స్వామి వివేకానంద కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
స్వామి వివేకానంద హిందూ మతం గురించి అవగాహన కల్పించారు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. భారతదేశం ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని స్వామి వివేకానంద ఎంతగానో ఎదురుచూశారు. అమెరికాలో ఈయన ప్రసంగానికి చాలా మంది ఆయన శిష్యులు కింద కూడా మారారు.
పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి స్వామి వివేకానంద. భారత దేశం వచ్చాక రామకృష్ణ మఠాన్ని కూడా స్వామి వివేకానంద స్థాపించడం జరిగింది. అయితే 39 ఏళ్లకే స్వామి వివేకానంద మరణించారు.
జూలై 4, 1902 న ఏమైంది..?
స్వామి వివేకానంద ఉదయాన్నే లేచి మూడు గంటలపాటు బేలూరు మఠంలో ధ్యానం చేసారు. శుక్ల యజుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ఫిలాసఫీ ఆఫ్ యోగాని విద్యార్థులకు నేర్పించి తర్వాత తోటి ఉద్యోగులతో పాటు రామకృష్ణ మఠానికి వెళ్లారు.
రాత్రి ఏడు గంటల ప్రాంతానికి వివేకానంద ఒంటరిగా గది లోకి వెళ్లారు. ఎవరిని కూడా రావద్దని చెప్పారు. 9:10 కి ధ్యానం చేస్తుండగా మృతి చెందారు స్వామి వివేకానంద. శిష్యులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మహాసమాధిని వివేకానంద పొందారని మెదడులోని ఒక రక్తనాళం పగిలిపోయి శాశ్వత నిద్రలోకి వెళ్లి పోయారని తెలుస్తోంది. అయితే ఇలా పగలడం వెనక కారణం బ్రహ్మరంధ్రం. మహాసమాధి సమయంలో ఇది జరిగినట్లు తెలుస్తోంది.
వివేకానంద మృతి చెందాక ఆయన దహన సంస్కారాలని రామకృష్ణ దహన సంస్కారాలు చేసిన దానికి ఎదురుగా బేలూరు లోని గంగా నది ఒడ్డున గంధపు చెక్కల చితి పై దహనం చేశారు.
కానీ చిన్న వయస్సులోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడం అందరినీ బాధ పెడుతుంటుంది. పైగా యోగి తమ స్వంత జీవిత కాలాన్ని పొడిగించుకుని ఎక్కువ కాలం జీవించలేరా అని చాలా మంది ఆశ్చర్య పడుతూ వుంటారు. అయితే ఈయన మరణం వెనుక భిన్న అభిప్రాయాలు వున్నాయి. కొందరు మహాసమాధి అంటే కొందరు సాధారణ మరణం అంటారు. వివేకానంద వంటి వాళ్ళ మరణం వెనుక ఒక అపారమైన ఆధ్యాత్మిక వాస్తవికత ఉంటుంది. ఏది ఏమైనా మరణం అనేది జీవితం యొక్క వాస్తవికత.
End of Article