వినాయకుడికి నైవేద్యంగా మటన్, చికెన్, ఫిష్.. ఎక్కడో తెలుసా..?

వినాయకుడికి నైవేద్యంగా మటన్, చికెన్, ఫిష్.. ఎక్కడో తెలుసా..?

by kavitha

Ads

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు  ఘనంగా జరుగుతున్నాయి. గణేషుడికి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తూ భక్తిశ్రద్దలతో పూజలు చేస్తున్నారు. గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు, లడ్డులను నైవేద్యంగా భక్తులు సమర్పిస్తున్నారు.

Video Advertisement

వినాయక చవితి నుండి వినాయకుడి నిమజ్జనం చేసే వరకు భక్తులు నిష్టగా పూజలు చేస్తూ మాంసాహారానికి దూరంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గణపతిని పూజించడం కోసం నాన్ వెజ్ కు అంతటా భక్తులు దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో ఏకంగా గణపతికే నైవైద్యంగా నాన్ వెజ్ ను సమర్పిస్తారట. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం..
తెలుగు న్యూస్ 18 ప్రకారం, అక్కడ గణపతికి మాంసాహారాన్ని నైవైద్యంగా సమర్పిస్తారు. నమ్మలేకుండా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఇది వేరే దేశంలో కాదు, ఇండియాలోనే. ఉత్తర కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో గణపతికి నాన్ వెజ్ నైవేద్యంగా పెట్టడం అనేది వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. సావాజీ కమ్యూనిటీకి చెందినవారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. గణేషునికి వివిధ రకాల మాంసాహార వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. మాంసాహార ప్రియులు ఇలి వారం కోసమే నెల రోజులు ఎదురు చూస్తారట.
ఉత్తర కర్ణాటక సావాజీ కమ్యూనిటీకి చెందిన వారు శ్రావణ మాసాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణం నుండి వినాయక చతుర్థి వరకు మాంసాహారాన్ని తినరు. మాంసాహార డైట్ ను ఎలుకల వీక్ మొదలవుతుంది. తొలి రోజు మోదక, కడుబు వంటి తీపి ఆహారాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు వినాయకుడి మూషికానికి ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా ఎలుకలు మొక్కలకు హాని చేస్తాయి. ఇలా  ఎలుకలను పూజిస్తూ, హాని కలిగించకూడదని ప్రార్ధిస్తారు.
నాన్ వెజ్‌లో వంటకాలలో మటన్ వంటకాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. మటన్ మసాలా, మటన్ ఖీమా, మటన్ బోటీ తదితర వాటిని నైవేద్యంగా పెడతారు. అయితే కొందరు చికెన్, చేపలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎడ్మి, రోటీ మొదలైన వంటకాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా వినాయకుడికి మాంసాహార వంటకాలు నైవేద్యంగా సమర్పించడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also Read: సనాతన ధర్మం, హిందూ ధర్మం… ఈ రెండు ఒకటే అనుకుంటాం..! కానీ ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఉందా..?

 


End of Article

You may also like