Ads
వినాయక చవితి వేడుకలు ఈ ఏడాది ఘనంగా జరుపుకున్నారు. వీధి వీధిలో గణపతులను పెట్టి తొమ్మిది రోజుల పాటు భక్తులందరూ భక్తితో నిష్టగా పూజలు, భజనలు చేస్తూ పండుగను జరుపుకుంటారు. గణేశ్ నవరాత్రులు పూర్తవడంతో వినాయకుడి నిమజ్జనం కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల గణపతి నిమజ్జనం చేశారు.
Video Advertisement
అయితే వినాయకుడిని పూజించేటపుడు భక్తులందరు గుంజీలు తీస్తుంటారు. గణపతి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు అనే విషయం ఎక్కువ మందికి తెలియదు. చాలా సార్లు ఆ సందేహం వచ్చినా, సమాధానం తెలియక మౌనంగా ఉంటారు. మరి వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో ఇప్పుడు చూద్దాం.. శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవి అన్నాచెల్లెళ్ళు. ఒకసారి మహావిష్ణువు పరమేశ్వరుడిని చూడటానికి కైలాసానికి వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు తన మేనల్లుడు అయిన గణపతిని వైకుంఠం తీసుకుని వెళ్ళాడు. అక్కడ సుదర్శన చక్రంతో సహా తన ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టాడు. అయితే బాల గణపతి బంగారు కాంతులతో మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకుని, సైలెంట్ గా కూర్చున్నాడు. ఆ తరువాత విష్ణువు చక్రం కనిపించకపోయేసరికి దాని కోసం వెతకడం ప్రారంభించాడు.
అప్పుడు గణపతి ఏం వెతుకుతున్నావు మావయ్యా అని అడుగగా, సుదర్శన చక్రం కోసం వెతుకున్నా అని విష్ణువు చెబుతాడు. అప్పుడు ఆ చక్రాన్ని తినేశాగా మావయ్యా అని గణపతి చెబుతాడు. విష్ణువుకు గణపతి అంటే చాలా ఇష్టం. అందువల్ల ఏమి అనలేడు. అందువల్ల అది రాసక్షులను సంహారం చేసే సుదర్శన చక్రం అని, ఎలా దాన్ని బయటకు రప్పించాలో అర్ధం కాక, మొట్ట మొదటిసారి బాల గణపతి ముందు శ్రీ మహావిష్ణువు తన చేతులతో చెవులను పట్టుకుని గుంజీళ్ళు తీశాడు.
విష్ణువు ఏం చేస్తున్నాడో అర్ధం కానీ గణపతికి గుంజీలు తీయడం విచిత్రంగా అనిపించి, విపరీతమైన నవ్వు వస్తుంది. కడుపు నొప్పిచేంతగా గణపతి నవ్వాడు. అలా నవ్వుతున్న సమయంలో గణపతి కడుపులోని చక్రం బయటకి వస్తుంది. దాంతో శ్రీ మహావిష్ణువు ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఆ రోజు నుండి వినాయకుడి ముందు గుంజీలు తీయడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులు గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీయడం మొదలుపెట్టారు.
Also Read: వినాయకుడికి నైవేద్యంగా మటన్, చికెన్, ఫిష్.. ఎక్కడో తెలుసా..?
End of Article