Ads
ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం ఈరోజు (అక్టోబర్ 14)న ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం ఈరోజు రాత్రి 8 గంటల 34 నిముషాలకు మొదలై, అర్ధరాత్రి 2 గంటల 25 నిముషాలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు.
Video Advertisement
దేశంలో గ్రహణం కనిపించకపోయినా, విదేశాలలో మాత్రమే కనిపించినా కూడా, గ్రహణ ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు. ఈ సూర్యగ్రహణం వల్ల ఐదు రాశుల వారికి శుభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. మిథున రాశి:
ఈ సూర్యగ్రహణం వల్ల మిథున రాశికి చెందినవారికి శుభప్రదం అని, మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశివారు వారి కెరీర్‌లో కొన్నింటిలో సక్సెస్ పొందుతారట. మానసిక ప్రశాంతత కలుగుతుందట. వీరికి ఆర్థికంగా లాభపడే ఛాన్సులు ఉన్నాయని, ఆఫీసులో ఈ రాశి వారు చేసే వర్క్ ప్రశంసించబడుతుందని చెబుతున్నారు. సూర్య గ్రహణ టైమ్ లో ఆదిత్య హృదయం చదివితే శుభ ఫలితం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
2. సింహరాశి:
సింహరాశి వారికి ఈ సూర్యగ్రహణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసే వారు లాభాలను పొందవచ్చు. వీరు ఫ్యామిలితో సంతోషంగా గడుపుతారు. శత్రువులు ఈ రాశివారికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు తలవంచరు. నేడు ఆదిత్య హృదయంతో పాటుగా, సూర్య జపం చేసుకుంటే శుభ ఫలితం ఉంటుంది.
3. తులారాశి:
తులారాశి చెందిన వారికి ఈ సూర్యగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సొసైటీలో వీరి స్థాయి పెరుగుతుంది. చేసే పనిలో సక్సెస్ ను సాధిస్తారు. అదృష్టం ఉంటే,పెండింగ్ లో ఉన్న పని సైతం పూర్తవుతుంది. వ్యాపారం చేసేవారికి శుభప్రదంగా ఉంటుంది. గ్రహణ సమయంలో కేతు, రవి గ్రహాల జపాలు చేసుకుంటే మంచిది.
4. వృశ్చికరాశి:
ఈ రాశివారికి సూర్య గ్రహణం శుభప్రదంగా ఉంటుందని, గ్రహణ ప్రభావం వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరి శ్రమ ఫలిస్తుంది. ఈ రాశివారు ఫైనాన్షియల్ గా లాభపడే అవకాశాలు, ఫ్యామిలీ నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారు నవగ్రహ జపం చేసినట్లయితే శుభ ఫలితం కలుగుతుంది.
5. మకర రాశి:
మకర రాశి వారికి సూర్య గ్రహణం కలసివస్తుంది. ఈ సమయంలో వీరికి ఖర్చులు పెరిగినా, మరోవైపు నుండి ఆర్థికంగా లాభాలు రావచ్చు. అదృష్టం ఈ రాశివారి వైపు ఉంటుంది. వీరు ఈ సమయంలో ఇల్లు, భూమి లేదా వాహనం కొనవచ్చు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ ఐదు రాశుల పై నేడు వచ్చే సూర్యగ్రహణ ప్రభావంమూడు నెలల పదహారు రోజుల పద్దెనిమిది గంటల పాటు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Also Read: సనాతన ధర్మం, హిందూ ధర్మం… ఈ రెండు ఒకటే అనుకుంటాం..! కానీ ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఉందా..?
End of Article