Ads
మనలో ప్రతి ఒక్కరూ రైలులో ప్రయాణించే ఉంటాం. రైలు ప్రయాణం అంటే ప్రతి ఒక్కరికి సరదానే. భారతీయ రైల్వే అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ప్రతిరోజు కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తూ ఉంటుంది. ప్రతినిత్యం రైల్వే స్టేషన్ లు ప్రయాణికులతో రద్దీ అవుతూ ఉంటాయి. పండుగల సీజన్ వచ్చిందంటే ఇక చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ట్రైన్ వెళ్లే ట్రైన్ తో హడావిడి నెలకొంటుంది.
Video Advertisement
ఇక ప్రయాణికులు తాము ఎక్కే ట్రైన్ ఏ ప్లాట్ఫారం మీద ఉంది, తమ బెర్త్ ఏ నెంబరు, ట్రైన్ నెంబర్ ఎంత ఇలాంటివి వెతుక్కుంటూ స్టేషన్ లో హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రయాణికులు అందరికీ ఉపయోగపడే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ అనౌన్స్ మెంట్ చేస్తూ ఉంటుంది. ట్రైన్ నెంబర్లతో, పేర్లతో, ప్లాట్ఫారం సంఖ్యతో ఈ అనౌన్స్ మెంట్ లు వస్తూ ఉంటాయి.
అయితే మనం ఆ అనౌన్స్ మెంట్ వినేసి వదిలేస్తాం కానీ దాని వెనక ఉన్న గొంతు ఎవరిది అని ఎప్పుడైనా ఆలోచించారా….? ఆ గొంతు మీకు గుర్తొచ్చిందా. అయితే ఇది మీకోసమే ఆ అనౌన్స్ మెంట్ వెనక ఉన్న గొంతు ఎవరిదో ఇప్పుడు మీకు చూపిస్తాం. ఆ గొంతు ఎవరిదొ కాదు తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రిది. దీని వెనక ఉన్న అసలు కథను ఆమె వివరించారు.
మనలో చాలామంది ఆ అనౌన్స్ మెంట్ ప్రతిరోజు ఆమె కూర్చుని చెబుతారు అని అనుకుంటాం. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది ఎప్పుడో 2007 సంవత్సరంలో రికార్డు చేసిన ఆడియో. ట్రైన్ సంఖ్యలు కూడా ఒకటి నుండి తొమ్మిది వరకు విడివిడిగా తీసుకుని వాటిని జత చేసి చెబుతారని తెలిపారు. ప్లాట్ఫామ్ సంకి కూడా ఇదే విధంగా రికార్డు చేసుకున్నారని తెలియజేశారు. ట్రైన్ ల పేరు కూడా ఏ ట్రైన్ కి ఆ ట్రైన్ విడిగా తీసుకున్నారని తెలియజేశారు. వాటన్నిటినీ ఆ ట్రైన్ కి అనుగుణంగా, నెంబర్ కి అనుగుణంగా జత చేసి అనౌన్స్ మెంట్ ఇస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్ లోని రైల్వే స్టేషన్ల ఎనౌన్స్ మెంట్ కి ఆమె డబ్బింగ్ చెప్పినట్లుగా తెలిపారు. హాయ్ అనౌన్స్మెంట్లకు డబ్బింగ్ చెప్పినందుకుగాను తనకి రూ.5000 రూపాయలు పారితోషకం ఇచ్చినట్లుగా తెలియజేశారు. ఇప్పటికే ఆమె పలు సీరియల్లు ,సినిమాలుకు డబ్బింగ్ చెబుతున్నారు.
Watch Video:
End of Article