Ads
ఇటీవల బస్సులలో ఆడవాళ్ళకి ప్రయాణాలు ఉచితం చేసిన సంగతి తెలిసిందే. గత శనివారం మహాలక్ష్మి పేరుతో ఈ పథకం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుండి ఎక్కడికి అయినా సరే ఉచితంగా ఈ బస్సులలో ప్రయాణం చేయవచ్చు.
Video Advertisement
అయితే దీని మీద కొంత మంది మరొకరకంగా స్పందిస్తున్నారు. “కేవలం మహిళలకి మాత్రమే ఈ ఉచిత బస్సు సదుపాయం ఏంటి? మగవాళ్ళకి ఎందుకు లేదు?” అంటూ కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది అయితే, “ఈ పథకం వల్ల ఆర్టీసీ మరింత నష్టాల్లోకి కూరుకుపోతుంది” అని, “దాంతో దివాలా తీసే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది” అంటూ చెబుతున్నారు. కానీ దీని వల్ల లాభాలు కూడా ఉన్నాయి అంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయం మీద ఒక మహిళ ఈ విధంగా మెసేజ్ చేశారు. ఆమె ఏం అన్నారంటే.
#1 చాలా మంది మహిళలు ట్రాన్స్పోర్ట్ లేక చదువులు మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సదుపాయం కారణంగా వారికి దగ్గరలో ఉన్న విద్యాసంస్థలో వాళ్ళు వెళ్లి చదువుకుంటారు. ఎక్కువ జీతాలు వచ్చే ప్రాంతాలకు వెళ్లి పని చేస్తారు. దాంతో వారి ఆదాయం పెరుగుతుంది. కాలుష్యం తగ్గుతుంది. ప్రజా రవాణాపై 70 శాతం మంది ఆధారపడినప్పుడు అక్కడ నగర కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది అని అంటున్నారు. దాంతో ప్రైవేట్ వెహికల్స్ వాడకం తగ్గి, డీజిల్, పెట్రోల్ ఉపయోగించడం కూడా తగ్గి, దీని వల్ల జిడిపి పెరుగుతుంది.
#2 చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ ఫ్రీ బస్సు సదుపాయం అనేది ఒక ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా మంది ఆడపిల్లలకి వాళ్ళ ఇళ్లల్లో, “వచ్చే కొంత డబ్బు కోసం ఎందుకు ఇంత దూరం తిరిగి ఉద్యోగం చేయడం?” అంటూ మాటలు వస్తూ ఉంటాయి. దాంతో కొత్త ఉపాధి వెతుక్కోవడానికి ఈ సదుపాయం అనేది తోడ్పడుతుంది. రవాణా ఖర్చులు చాలా వరకు ఆదాయం అవుతాయి.
#3 ఇలా ఉచిత బస్సులు ఉన్న కారణంగా ఆడవాళ్ళు బయటికి వచ్చి ఉద్యోగాలు చేస్తారు. ఈ పోటీ ప్రపంచంలో మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్లు పనిచేయాలి అని ఎంతో కష్టపడుతున్నారు. కానీ వారు ఉండే చోటు నుండి, వారు పని చేసే చోటు చాలా దూరం ఉండడంతో, మళ్లీ వెళ్లి వచ్చేసరికి ఎంత సమయం అవుతుందో, అసలు అంత దూరం వెళ్లి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచించి ఎంతో మంది ఆడవాళ్లు సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సదుపాయం కారణంగా ఎంతో మంది ఆడవాళ్లు వచ్చి పని చేస్తారు. ఈ రకంగా కూడా శ్రమశక్తి పెరుగుతుంది అని చెప్పవచ్చు.
#4 పబ్లిక్ ప్లేసెస్ లో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఆడవాళ్ళ మీద వేధింపులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సదుపాయాల కారణంగా వాటికి కొంత వరకు చెక్ పడుతుంది. బస్సులలో ప్రయాణించే ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆడవాళ్లు సౌకర్యంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణం చేయగలుగుతారు. ఆడవాళ్ళకి ఒక భద్రత అనేది వస్తుంది. దాంతో ఈ రకంగా కూడా ఈ ఉచిత సదుపాయం ఉపయోగపడుతుంది.
#5 ఈ సదుపాయం వల్ల ఆర్థికంగా కూడా అభివృద్ధి అవుతుంది. అది ఎలాగంటే, దూరం కారణంగా మంచి కంపెనీలకు వెళ్లి పని చేయడానికి వీలుపడని ఆడవాళ్లు ఇప్పుడు ఈ సదుపాయంతో ఎంత దూరమైనా సరే ఉచితంగా ప్రయాణించగలుగుతారు. దాంతో వారు మంచి ఉద్యోగాలు చేసి డబ్బుని సంపాదించుకోగలుగుతారు. దీంతో మహిళలకు కూడా ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది.
“ఇవి మాత్రమే కాదు. ఆడవాళ్ళకి ఈ సదుపాయం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇది నిజంగా సమాజంలో ఒక మంచి మార్పుకి కారణం అవుతుంది” అంటూ ఆ మహిళ ఫ్రీ బస్సు సదుపాయాల ద్వారా వచ్చే ఉపయోగాల గురించి చెప్పారు.
ALSO READ : వేలకోట్ల ఆస్తికి ఒక మెకానిక్ అధినేత.. అతని సక్సెస్ స్టోరీ వింటే శభాష్ అనాల్సిందే?
End of Article