Ads
సౌకర్యాలు ఎంత పెరిగిపోయినా సరే, రైలు ప్రయాణాలు అంటే ఇప్పటికి కూడా ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. ట్రైన్ కిటికీలో నుండి చుట్టూ ఉన్న ప్రదేశాలని చూస్తూ అలా ప్రయాణం చేయడం చాలా మందికి ఒక సరదా.
Video Advertisement
అందుకే సమయం ఉంటే చాలా మంది ట్రైన్ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ట్రైన్లలో చాలా రకాలు ఉన్నాయి. అందులో కరెంట్ తో నడిచే ట్రైన్ కూడా ఒకటి. అయితే చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది.
అది ఏంటి అంటే, కరెంట్ తో నడిచే ట్రైన్ లో షాక్ ఎందుకు కొట్టదు? ఈ అనుమానం మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది కదా? దీని సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక సమయంలో రైళ్లు బొగ్గుతో నడిచేవి. వీటి వేగం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రైన్స్ మాత్రం కరెంట్ తో నడుస్తున్నాయి దాంతో ఈ ట్రైన్ స్పీడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది.
ట్రైను ఇనుముతో తయారు చేస్తారు. విద్యుత్ ప్రవాహం ఇనుములో, నీటిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ట్రైన్ మాత్రం కరెంట్ షాక్ మాత్రం కొట్టదు. ఎందుకంటే, ట్రైన్ పట్టాలపై నడిచే అధిక వోల్టేజ్ లైన్ ప్యాసింజర్ కోచ్ తో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండదు. అంతే కాకుండా, అధిక వోల్టేజ్ లైన్ నుండి ట్రైన్ కి కరెంట్ సరఫరా అనేది ఇంజన్ మీద ఇన్స్టాల్ చేసిన పాంటోగ్రాఫ్ నుండి వెళ్తుంది.
ట్రైన్ ఇంజన్ మీద ఇది ఉంటుంది. ఈ పాంటోగ్రాఫ్ ని అధిక వోల్టేజ్ లైన్ కి కనెక్ట్ చేసి పెడతారు. రైల్ ప్యాసింజర్ కోచ్ లకి ఈ వోల్టేజ్ లైన్ తో సంబంధం ఉండదు. ఈ కారణంగానే వాటికి విద్యుత్ షాక్ కొట్టదు. ట్రైన్ ఇంజన్ కి కరెంట్ వెళ్తుంది. కానీ అప్పుడు షాక్ ఎందుకు కొట్టదు అనే అనుమానం కూడా మీలో కొంత మందికి వచ్చి ఉండొచ్చు. ఇందుకు కూడా ఒక కారణం ఉంది.
అది ఏంటంటే, ఇంజన్ లో ఉన్న పాంటోగ్రాఫ్ కింద ఇన్సులేటర్స్ పెడతారు. ఇవి కరెంట్ షాక్ ని నిరోధిస్తాయి. అంతే కాకుండా మోటార్, ట్రాక్షన్ ట్రాన్స్ఫార్మర్ నుండి బయటికి వచ్చిన తర్వాత రిటర్న్ కరెంట్ అనేది చక్రాలు, యాక్సిల్, ఎర్త్ పొటెన్షియల్ కండక్టర్ ద్వారా ట్రైన్ కి తిరిగి వెళుతుంది. అందుకే ఇనుముతో తయారు చేసినా కూడా కరెంట్ మీద నడిచే ట్రైన్ లకి షాక్ కొట్టదు.
ALSO READ : RTC లో ఉచిత ప్రయాణం వల్ల జరిగేది ఇదే అంటూ… ఓ మహిళ పంపిన మెసేజ్ ఇది..నిజమే అంటారా.?
End of Article