Ads
సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆహారాలవాట్లు మారుతాయి. కొంత మంది ఆహార విషయంలో చిన్నప్పటి నుండి జాగ్రత్త తీసుకుంటారు. మరి కొంత మంది మాత్రం యుక్త వయసుకు వచ్చాక ఆరోగ్యపరంగా ఎవరికి తగ్గట్టు వారు ఆహార నియమాలు పెట్టుకొని పాటిస్తూ ఉంటారు.
Video Advertisement
వీటిలో సెలబ్రిటీలు ఏమి మినహాయింపు కాదు. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే అందరికంటే ఎక్కువ కఠినంగా ఉండే ఆహార నియమాలు పాటించేది వీరే.
ముఖ్యంగా సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన వాళ్లు అయితే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు కూడా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ సమయంలో ఎలాంటి ఆహారాలు తినాలి అనే విషయాన్ని తెలుసుకొని అదే డైట్ ప్లాన్ క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
# ఉదయం : ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రెండు దోసెలు, ఓట్స్ ఉప్మా, కొద్దిగా చట్నీ, ఎగ్ వైట్ తీసుకుంటారు.
# అల్పాహారానికి, భోజనానికి మధ్యలో ఒక పండు తీసుకుంటారు.
# మధ్యాహ్నం : రాగి, జొన్న, సజ్జ, రెండు లేదా మూడు వెజిటబుల్స్ తో వండిన కూరలు, కొంచెం పెరుగు తీసుకుంటారు.
# లంచ్ కి, సాయంత్రం స్నాక్స్ కి మధ్యలో కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు.
# సాయంత్రం : సూప్, స్నాక్స్, ఎగ్ వైట్ తీసుకుంటారు.
# రాత్రి : ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగుతారు. మరి ఎక్కువగా ఆకలి వేస్తే ఒక పండు తీసుకుంటారు.
ఇవన్నీ మాత్రమే కాకుండా రోజుకి 6:00 గంటల నిద్ర తప్పనిసరి. ఈ ఆహార నియమాలు అన్నిటిని చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా పాటిస్తారు. అంతే కాకుండా తీసుకున్న ఆహారానికి వచ్చిన క్యాలరీలు కూడా లెక్క వేసుకుంటారు. వ్యాయామంతో ఎన్ని క్యాలరీస్ కరిగిపోతాయి, శరీరానికి ఎన్ని క్యాలరీస్ అవసరమవుతాయి అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ డైట్ ప్లాన్ రూపొందించుకుంటారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యాయామంలో మార్పులు కూడా చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆహారపు అలవాట్లు ఇవే.
ALSO READ : TDP-JANASENA: పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు తెలుసా….?
End of Article