Ads
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కార్పొరేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయిలో పనిచేసేవారు ఏ విషయాన్ని అయినా ఆన్లైన్ లోనే చెబుతుంటారు. కంపెనీ విషయాల దగ్గర నుండి రాజీనామా వరకు కూడా అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుంది. లేదంటే లెటర్ హెడ్లను ఉపయోగిస్తారు.
Video Advertisement
కానీ ఇందుకు భిన్నంగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ చేయబడిన ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసే టాప్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న మహిళా ఉన్నతాధికారి తన రాజీనామాను ఒక రూల్డ్ పేపర్ లో రాసింది. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒక కార్పొరేట్ కంపెనీ సంస్థ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్ చేతితో వ్రాసిన, రెండు పేరాల రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రింకూ పటేల్ అనే మహిళ మిట్షీ ఇండియా కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల ఆమె రాజీనామా చేశారు. రింకూ పటేల్ రాజీనామా లెటర్ వ్రాసే విషయంలో డిఫరెంట్ గా ఆలోచించింది.
డిసెంబర్ 15న తన మేనేజింగ్ డైరెక్టర్‌కి, పిల్లలు స్కూల్‌లో ఉపయోగించే నోట్‌బుక్‌లో కనిపించే ఒక రూల్ కాగితంపై వ్రాసిన చేతితో రాసిన రాజీనామా లేఖను సమర్పించారు. అంతేకాకుండా ఈ లేఖ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు కూడా పంపించారు. ఆ లేఖలో ” వ్యక్తిగత కారణాల” కారణంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్ట్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. లేఖ కాపీని డిసెంబర్ 21న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్‌లో పంచుకున్నారు.
అక్కడి నుండి అది సోషల్ మీడియాలోకి వచ్చింది. చేతిరాతతో రాసిన రాజీనామా లేఖ వైరల్‌గా మారింది. రాయిటర్స్ రిపోర్టర్ సేతురామన్ ఎన్ఆర్ రింకూ పటేల్ చేతితో రాసిన రాజీనామా లేఖ ఫోటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ‘తన పిల్లల రఫ్ నోట్ పుస్తకం నుండి ఒక పేజీని తీసుకుని, దానిలో రాజీనామా లేఖ వ్రాసినట్లు’ అనిపించిందని రాసుకొచ్చారు.
this CFO seems to have borrowed a page from his kid's rough note book and have written resignation letter in that and uploaded in BSE. Listed companies in India 😂😂😂 pic.twitter.com/QOr73CR7U8
— Sethuraman NR (@chandsethu) December 21, 2023
Also Read: ఐపీఎల్ చరిత్రలో తొలి మహిళా ఆక్షనీర్ గురించి ఈ విషయాలు తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?
End of Article