ఒక సిటీలో 46 రైల్వే స్టేషన్లు..! ఎక్కడంటే..?

ఒక సిటీలో 46 రైల్వే స్టేషన్లు..! ఎక్కడంటే..?

by Harika

Ads

టెక్నాలజీ వృద్ధి చెందుతున్న కొద్ది మనకు వసతులతో పాటు అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్పోర్ట్ కూడా వృద్ధి చెందుతూ వచ్చింది. అలా ప్రతి ఊరికి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ కామన్ అయిపోయాయి. అయితే ఊర్లు పెరిగే కొద్దీ రైల్వేస్టేషన్లో కూడా పెరుగుతూ వచ్చాయి.

Video Advertisement

చాలా వరకు చిన్న చిన్న ఊర్లకి ఒక రైల్వే స్టేషన్ ఉంటే కొన్ని దగ్గర్ల ఊర్లో విస్తరించే కొద్దీ జనాల అవసరాలు పట్టి ఒక రెండు మూడు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఒక సిటీలో మాత్రం ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు 46 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇంకో నాలుగు కలిపితే హాఫ్ సెంచరీ అవుతుంది కదా అని నవ్వుకోకండి.. నిజంగానే 46 ఉన్నాయి. ఆ సిటీ మరి ఏదో కాదు మన దేశ కాపిటల్ ఢిల్లీ.

reason behind electric trains current passing

ఢిల్లీలో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో నిజానికి అక్కడ ప్రజలకు కూడా తెలుసో తెలియదో అన్న అనుమానం కలుగుతుంది. ఢిల్లీలో చిన్నవి పెద్దవి మొత్తం కలుపుకొని సుమారు 46 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మరి అంత మంది జనాన్ని మేనేజ్ చేయాలి అంటే అన్ని రైల్వే స్టేషన్ అవసరమేగా. మొత్తానికి ఈ రైల్వే స్టేషన్ అన్నిటిని మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. A 1 కేటగిరిలో నాలుగు రైల్వేస్టేషన్లో ఉంటే A క్యాటగిరిలో నాలుగు ఉన్నాయి. మిగిలిన 38 స్టేషన్స్ మైనర్ కేటగిరీ కిందకి వస్తాయి.

A1 క్యాటగిరి కిందకి ఆనంద విహార టర్మినల్ ,ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ ,న్యూఢిల్లీ ఏయే స్టేషన్లు వస్తాయి.A క్యాటగిరీకి ఆదర్శ నగర్,ఢిల్లీ కంటోన్మెంట్ ,ఢిల్లీ షాహ్దారా,ఢిల్లీ సరాయ్ రోహిల్లా స్టేషన్ లు వస్తాయి. ఇక మిగిలిన అని మైనర్ కేటగిరీలోకి వస్తాయి. చూశారా మన చుట్టుపక్కలే మనకు తెలియని ఎన్ని వింతలు ఉన్నాయో. ఒక సిటీకి 46 స్టేషన్స్ నిజంగా పెద్ద వింతే కదా..


End of Article

You may also like