Ads
సాధారణంగా ఎవరిని అయినా సరే పెళ్లి అంటే ఏంటి అని అడిగితే, చాలా మంది చాలా పొయటిక్ గా సమాధానాలు చెప్తారు. కొంత మంది మాత్రం సాధారణంగానే సమాధానం చెప్తారు. అయితే, చిన్నపిల్లల్ని మాత్రం ఇదే ప్రశ్న అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానాలు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి.
Video Advertisement
అలా ఇటీవల స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నకి ఒక స్టూడెంట్ రాసిన సమాధానం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. అంత చిన్న వయసులో ఆ స్టూడెంట్ రాసిన సమాధానం చూసి నవ్వాపుకోలేకపోతున్నారు నెటిజన్లు. “పెళ్లంటే ఏంటి?” అని ఒక ప్రశ్నని ఒక స్టూడెంట్ కి వేశారు. అందుకు ఆ స్టూడెంట్ ఈ విధంగా రాశారు.
ఆన్సర్ లో ఆ స్టూడెంట్, “నువ్వు పెద్ద అమ్మాయివి అయ్యావు. మేము నీకు తిండి పెట్టలేము అని, నీకు తిండి పెట్టే అబ్బాయిని వెతుక్కో అని ఒక తల్లిదండ్రులు ఒక అమ్మాయికి చెప్పినప్పుడు పెళ్లి జరుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఒక అబ్బాయిని కలుస్తుంది. ఆ అబ్బాయి మీద ఆ అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని, నువ్వు పెద్ద వాడివి అయ్యావు అని అరుస్తారు. అప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా కలిసి ఉంటారు. ఆ తర్వాత కొన్ని చెత్త పనులు చేసి పిల్లల్ని కంటారు” అని ఆ స్టూడెంట్ రాశారు.
ఈ సమాధానం చూసి షాక్ అయిన టీచర్, ఆ సమాధానాన్ని కొట్టివేశారు. కానీ ఈ ఆన్సర్ షీట్ మాత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో చూసిన వాళ్ళు అందరూ ఆ స్టూడెంట్ తెలివితేటలని చూసి నవ్వుతున్నారు. ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్న ఆ స్టూడెంట్ జ్ఞాని అని అంటున్నారు. ఇది జీవిత సత్యం అని, పెద్దవాళ్లకంటే చిన్న పిల్లలే ఇలాంటి విషయాల మీద సరైన సమాధానాలు ఇస్తారు అని, వాళ్లకే తెలివితేటలు ఉంటాయి అని కామెడీగా ఈ ఆన్సర్ షీట్ చూసి కామెంట్ చేస్తున్నారు.
End of Article