Ads
సంక్రాంతి పండుగ అనగానే రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పాటు గుర్తుకు వచ్చేది కోడిపందాలు కూడా. ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో ఎక్కువగా జరుగుతాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ రేంజ్ లో జరుగుతాయి.
Video Advertisement
గత ఏడాది ప్రభుత్వం కోడి పందేలు, గుండాటలకు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈ ఏడాది అనుమతి ఇవ్వడంతో పందెం రాయుళ్లు సంతోషంతో పొంగిపోయారు. ఈ క్రమంలో కోట్ల రూపాయలతో పందేలు కాశారని తెలుస్తోంది. అయితే ఈ కోడిపందాలు అసలు ఎందుకు మొదలు అయ్యాయో ఇప్పుడు చూద్దాం..
సంక్రాంతి వచ్చిందంటే, కోస్తా తీరంలో కోళ్ల పందేలు జోరుగా సాగుతుంటాయి. సంక్రాంతి మూడు రోజుల పాటు ఈ పందాలు కొనసాగుతుంటాయి. వీటిని వృత్తిగా బ్రతుకుతున్నవారు ఉన్నారు. ఇక ఈ కోడిపందెలా కోసం ఇతర రాష్ట్రాల నుండే కాకుండా, విదేశాల నుండి సైతం వచ్చేవారు ఉన్నారు. జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నా, ఈ పందేలు జరుగుతూనే ఉన్నాయి. పందెం రాయుళ్లు కోడిపందాల విషయంలో ఎంతో సీరియస్ గా ఉంటారు. కోడిపందాల నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. తమ కోడిపుంజే గెలవాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
కోనసీమ జిల్లా అమలాపురంలో కోడిపందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కోడి పందేల పేరుతో గుండాటలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో కోడి పందేలు 250 చోట్ల జరుగుతున్నాయి. కోడి పందెములు వేసేటప్పుడు కుక్కుట శాస్త్రాన్నిచదువుతారట. అయితే కోడి పందేలు అనేవి ఎలా మొదలు అయ్యాయో శ్రీ గరికపాటి నరసింహ రావు వివరించారు. ఆయన మాట్లాడుతూ ” కోడి పందేలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే పూర్వం, మహా యుద్దాలు తప్పవు అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు, యుద్ధాలు చేస్తే కొన్ని లక్షలమంది ప్రజలు చనిపోతారు.
అనవసరంగా పౌరుషాల కోసం, రాజ్య భాగం కోసం. ఈ పక్షం నుండి ఒక కోడిని, ఆ పక్షం నుండి ఒక కోడిని ఎంపిక చేసి, ఒక మంచి స్థలంలో రెండింటికీ పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోయినా లేదా పారిపోయినా వాళ్ళు ఒడిపోయినట్లు, మిగిలిన వారు గెలిచినట్టు అని చెప్పారంట. భారీ జన నష్టాన్ని తప్పించడం కోసం, యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పడం కోసం ఈ కోడి పందెలను ఏర్పాటుచేశారు. అందుకు ఉదాహరణ పల్నాటి యుద్ధం. ఇలాంటి పందెలను సంక్రాంతి పండుగకు ఆడటం తప్పు అయితే, జనవరి నెల అంతా ఆడటం, ఏడాది అంతా ఆడటం ఇంకా దుర్మార్గం” అని అన్నారు.
Also Read: అయోధ్య రామ మందిరానికి ప్రసాదం తయారు చేసే ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?
End of Article