అయోధ్య రామ మందిర నిర్మాణంలో… తెలుగువారైన G పుల్లారెడ్డి గారు కీలకపాత్ర ఎలా పోషించారో తెలుసా..?

అయోధ్య రామ మందిర నిర్మాణంలో… తెలుగువారైన G పుల్లారెడ్డి గారు కీలకపాత్ర ఎలా పోషించారో తెలుసా..?

by Mounika Singaluri

Ads

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22 తారీకున జరగనుంది ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7000 మంది విశిష్ట అతిధులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రామ మందిర నిర్మాణ ట్రస్ట్ బోర్డ్ ఇప్పటికే పూర్తి చేసింది.

Video Advertisement

అయితే అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశ విదేశాల నుండి కూడా అధిక మొత్తంలో డొనేషన్ లు అందించారు. ఆలయ నిర్మాణం కోసం 1800 కోట్లు ఖర్చు పెట్టగా ఇంకా ట్రస్టు వద్ద మూడు వేల కోట్ల రూపాయలు నిధులు మిగిలి ఉన్నాయి.

g pulla reddy ayodhya ram mandir contribution

అయితే ఆలయ నిర్మాణం చేపట్టారు కాబట్టి అందరూ డొనేషన్ లో అందిస్తున్నారు. కాకపోతే బాబ్రీ మసీదు కూల్చి వేసిన సమయంలో కోర్టు కేసుల విషయంలో రామ మందిరం నిర్మాణ ట్రస్టు వద్ద ఒక రూపాయి కూడా లేదు. అప్పట్లో విశ్వహిందూ పరిషత్తు రామ మందిర నిర్మాణం కోసం పోరాడేది. ఆలయ నిర్మాణ కేసు సుప్రీంకోర్టులో ఉండగా విశ్వహిందూ పరిషత్ ట్రస్టు వద్ద ఒక్క రూపాయి కూడా నిధులు లేకపోవడంతో విశ్వహిందూ పరిషత్ చైర్మన్ అశోక్ సింగల్ కి ఏం చేయాలో అర్థం కాలేదు.

g pulla reddy ayodhya ram mandir contribution

అయితే తెలుగువారైన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి పుల్లారెడ్డి గారు విశ్వహిందూ పరిషత్తు కోశాధికారిగా ఉన్నారు. అశోక్ సింగల్ కోర్టు కేసు విషయం పైన జి పుల్లారెడ్డి గారిని సంప్రదించగా హైదరాబాదులో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కోర్టు కేసులు ఖర్చులు కొరకు 25 లక్షల రూపాయలు అవుతుందని తెలియజేశారు. వెంటనే పుల్లారెడ్డి గారు తన వద్ద ఉన్న రెండు లక్షల రూపాయలు అందించి సాయంత్రంలోగా మరో 10 లక్షలు అందిస్తానని చెప్పారు.

చెప్పిన విధంగానే తన సన్నిహితుల వద్ద నుండి పది లక్షల రూపాయలు పోగేసి అశోక్ సింగల్ చేతికి అందించారు.అంతేకాకుండా రామమందిర నిర్మాణం కోసం ఎంత ఖర్చయినా తాను భరిస్తానని అవసరమైతే తన వద్ద ఉన్న బంగారం ఇల్లులు కూడా తాకట్టు పెడతానని పుల్లారెడ్డి గారు చెప్పారు.
ఎలాగైనా ఈ కేసులో మనం గెలుస్తామని కేస్ అంతా రామమందిని నిర్మాణానికి అనుకూలంగా ఉందని పుల్లారెడ్డి గారు విశ్వసించేవారని అశోక్ సింగల్ పుల్లారెడ్డి సంతాప సభలో చెప్పుకొచ్చారు.

g pulla reddy ayodhya ram mandir contribution

నేడు ఆలయ మందిరం పూర్తయి ప్రారంభోత్సవానికి చేరుకోవడంతో రామమందిరం నిర్మాణ ట్రస్ట్ తో పాటు విశ్వహిందూ పరిషత్తు సభ్యులందరూ కూడా పుల్లారెడ్డి గారిని గుర్తు చేసుకున్నారు. అలా రామ మందిరం ఆలయ నిర్మాణంలో తెలుగువారైన పుల్లారెడ్డి గారు కీలకపాత్ర పోషించడం తెలుగువారిగా మనందరం గర్వించదగ్గ విషయం


End of Article

You may also like