వారం నుండి సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ మహిళ ఎవరు..? ఈమె వంటలకి ఇంత క్రేజ్ ఎందుకు..?

వారం నుండి సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ మహిళ ఎవరు..? ఈమె వంటలకి ఇంత క్రేజ్ ఎందుకు..?

by kavitha

Ads

హైదరాబాద్ లో ఓ మహిళ తన భర్తతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. అది కూడా తక్కువ ధరలకు ఎక్కువ ఆహారాన్ని అందిస్తున్నారు. వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్ ను అందిస్తున్నారు. అది కూడా రోజువారీ కష్టపడుతూ పనిచేసేవారికి అందుబాటులో ఉండేలా ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు.

Video Advertisement

హైదరాబాద్ లో పాపులర్ అయిన ఆ మహిళ ఎవరో? ఎక్కడ ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఏమేం వంటకాలు, ఏ ధరలకు ఆహారాన్ని అందిస్తున్నారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
ఇన్ అర్బీటాల్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ లో పదకొండు అయ్యిందంటే చాలు. అక్కడికి ఫుడ్ కోసం చాలామంది వస్తారు. సాయి కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఆహారం టేస్టీగా ఉండడం, తక్కువ ధరలకు ఎక్కువ ఆహారం ఇస్తుండడంతో వారి ఫుడ్ బిజినెస్ బాగా సాగుతోంది. వంట అంతా ఆమె చేస్తుంది. ఆమె మాట్లాడుతూ, ఉదయం 5 గంటలకు వంటలు చేసుకుని, 11 గంటలకు షాప్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు అని చెప్పారు.
2011 నవంబర్ 29 కి స్టార్ట్ చేసారట. ఆమె గుడివాడకు చెందినవారు. ఈ బిజినెస్ ప్రారంభించక ముందు ఆమె మెషీన్ కుట్టేవారట. ఆమె భర్తకు ఫుడ్ బిజినెస్ అంటే ఆసక్తి ఉండడంతో, ఆయన సపోర్ట్ చేయడంతో ఆమె కూడా బిజినెస్ లో కి వచ్చారు. లాక్ డౌన్ సమయంలో అనాథలకు ఆహార సరఫరా చేసే వాళ్ళు సాయికుమారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆహారం వండించేవారట.
ఆమె సింగర్ హేమచంద్ర అమ్మగారింట్లో వంట చేసేవారు. బిజినెస్ విషయంలో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ప్లేట్ వెజ్ కి 60 రూపాయలు కాగా, నాన్ వెజ్ ప్లేట్ 80 రూపాయలకు అందిస్తున్నారు. బాగార వంటి రైస్ ఐటెమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ లో గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ వంటి ప్లేట్ కు ఒక ఐటెం చొప్పున అందిస్తున్నారు. రోజుకు 300 వందల మంది వరకు వస్తారని వెల్లడించారు.

Also Read: అయోధ్య రామ మందిరానికి ప్రసాదం తయారు చేసే ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?


End of Article

You may also like