అయోధ్య రామ మందిరం ఆహ్వాన పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసి ఉందంటే..?

అయోధ్య రామ మందిరం ఆహ్వాన పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసి ఉందంటే..?

by Mounika Singaluri

Ads

అయోధ్య రాముడు ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దేశ విదేశాల్లో ఉన్న 7000 మంది ప్రముఖులకు ఆలయ ప్రారంభోత్సవం శ్రీ రాముని ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానాలు ఉన్నాయి. రామన్మందిర నిర్మాణ ట్రస్ట్ స్వయంగా వెళ్లి ఆహ్వానాలు అందించింది.

Video Advertisement

అయితే ఈ ఆహ్వాన పత్రిక కిట్ లో ఏమేమి ఉన్నాయో అంటూ పలువురు ఆసక్తిగా చూస్తున్నారు…! వాటి వివరాలు మీకోసం…

ఈ ఆహ్వాన పత్రిక మీద ఒన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ అంటూ రాసి ఉంది. ఈ ఆహ్వాన పత్రిక హిందీ ఇంగ్లీష్ భాషలలో ముద్రించి ఉంది.ఈ ఆహ్వాన పత్రికలో డికరేటివ్ పేపర్లు, బుక్లెట్లు,రాముడి చిత్రపటం ఉన్నాయి. ఇంక మెయిన్ ఇన్విటేషన్ కార్డులో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ వివరాలు… అలాగే రామ మందిరం ఫోటో ముద్రించి ఉన్నాయి.

ayodhya ram mandir invitation

ఆ ఫోటో కింద శ్రీరామ ధాం ..అయోధ్య అని ముద్రించారు.అలాగే కార్డ్ మీద ఇన్విటేషన్ ఎక్స్ట్రా ఆర్డినైర్ అని ఇంగ్లీషులో అపూర్వ అనందిక్ నిమంత్రన్ అని హిందీలో ఉన్నాయి.అలాగే ఆహ్వాన పత్రిక లోపల బాల రాముని ఫోటో ముద్రించి ఉంది.అలాగే ప్రధాన ఆహ్వాన పత్రిక తర్వాత పేజీలో ఆలయ ప్రారంభ ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలు ఉంచారు.

ఇది కాకుండా మెమొరి ఆఫ్ హానర్ అంటూ ఇంకో ప్రత్యేకమైన బుక్ లేట్ ఉంది.ఆ బుక్ లేట్ లో రామ మందిరం పోరాట సంబంధిత వివరాలు పొందుపరిచారు. అలాగే ఈ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన విశ్వహిందూ పరిషత్ సభ్యుల వివరాలను కూడా ముద్రించారు.

ayodhya ram mandir invitation

అలాగే ఆహ్వాన పత్రిక అందించిన వారికి ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇచ్చారు.
ఒక బాక్స్ లో శ్రీరాముని ప్రసాదమైనా 100 గ్రాముల మోతిచుర్ లడ్డు ఉంచారు. అలాగే ఇంకో బాక్స్ లో రామ మందిరం నిర్మాణ స్థలం మట్టిని, ఒక బాటిల్ సరయు నది నీటిని, అలాగే భగవద్గీతకు సంబంధించిన ఒక పుస్తకాన్ని పెట్టారు. ఈ ఆహ్వాన పత్రికను దేశ విదేశాల్లో ఉన్న 7 వేల మంది విశిష్ట అతిథులకు అందించారు


End of Article

You may also like