తిరుపతిలో స్వాతంత్రం రాకముందు మొదలైన బేకరీ.. ఆ స్వీట్ చాలా స్పెషల్.. ఏమిటంటే..?

తిరుపతిలో స్వాతంత్రం రాకముందు మొదలైన బేకరీ.. ఆ స్వీట్ చాలా స్పెషల్.. ఏమిటంటే..?

by kavitha

Ads

స్వీట్స్ ను ఇష్టపడని వారు ఎవరు ఉండరని చెప్పవచ్చు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్వీట్ ఫేమస్. ఆ ప్రాంత  ప్రజల అభిరుచులకు తగినట్టు అక్కడి ఆహారం, స్వీట్స్ లభిస్తుంటాయి. అయితే ఏదో ఒక  స్వీట్ ని మాత్రం చాలా ఇష్టపడుతుంటారు. అలా ఆ స్వీట్ ఫేమస్ అవుతుంటుంది.

Video Advertisement

అదే విధంగా తిరుపతిలో ఓ స్వీట్ చాలా ఫేమస్. అది కూడా ఒక షాప్ లోనే అందుబాటు ఉంటుంది. ఆ స్వీట్ స్వాతంత్ర్య ఉద్యమ టైమ్ లో ఎంతో ఫేమస్. ఇప్పటికీ దానిని తిరుపతి వాసులతో పాటుగా, అక్కడికి వెళ్ళినవారు కూడా రుచి చూస్తున్నారు. ఆ స్వీట్ ఏమిటో ? అది లభించే షాప్ ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో గాంధీ నడిచిన దారిని ఇప్పటికీ గాంధీ రోడ్డు అని పిలుస్తుంటారు. ఈ రోడ్ లో ఒక ఓల్డ్ బేకరీ ఉంది. అది ఇప్పటిది కాదు. స్వతంత్రం రాకముందు, 1933 లో ప్రారంభించిన రామకృష్ణ బేకరీ ఇది.  స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ షాప్ లో లభించే స్వీట్ చాలా ఫేమస్. ఈ బేకరీలో ఇప్పటికీ స్వాతంత్ర ఉద్యమ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఈ బేకరిని 1936 లో శ్రీ రామ కృష్ణయ్య మొదలుపెట్టారు. ఇప్పటికీ వారి వారసులు దానిని కొనసాగిస్తున్నారు.
గాంధీజీ 1921 లో ఈ మార్గం గుండా నడిచారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో గత తొంబై  సంవత్సరాలుగా రామకృష్ణ బేకరీ ఒక ప్రత్యేక స్వీట్ ను అందిస్తోంది. ఆ స్వీట్ పేరు బాసంతి. దీనిని బాసుంది అని కూడా పిలుస్తారు. ఈ స్వీట్ ని చూస్తే స్థానీకులకే  కాకుండా తిరుపతికి వచ్చే టూరిస్టులకు కూడా నోరూరుతుంది. పాలకోవాను ఇష్టపడే స్వీట్ లవర్స్ బాసంతిని సైతం అంతే ఇష్టంగా తింటారు.
బాసంతి కప్పు ధర 50 రూపాయలు. దీనిని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ బేకరిని గాంధీజీ కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఆ బేకరీలో కనిపిస్తాయి. “90 సంవత్సరాలుగా బాసంతి తయారీలో ఎటువంటి మార్పులు చేయలేదని, అప్పటిలానే ఇప్పుడు తయారు చేస్తూ వస్తున్నమని” నిర్వాహకులు కుమార్ వెల్లడించారు.

Also Read: వారం నుండి సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ మహిళ ఎవరు..? ఈమె వంటలకి ఇంత క్రేజ్ ఎందుకు..?


End of Article

You may also like