Ads
దేశంలో చేసిన కొన్ని మార్పుల వల్ల భారీగా లాభాలు జరిగాయి. ప్రజలందరూ కొన్ని ఇబ్బందుల నుండి బయటపడ్డారు. అలాంటి ఒక మార్పు మెట్రో తీసుకురావడం. మెట్రో వల్ల సిటీలో ఉండే ఎంతో మందికి లాభం కలిగింది. ప్రయాణం సులభం అయ్యింది. ట్రాఫిక్ తగ్గింది.
Video Advertisement
మెట్రోల్లో ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. మెట్రోలకి రూట్లు కూడా పెంచుతున్నారు. ట్రైన్లు కూడా ఎక్కువగా అందుబాటులో ఉండడంతో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా రావట్లేదు.
అయితే మెట్రోలు ఒక సమయం నుండి ఒక సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రాత్రి 11 గంటల 30 నిమిషాలు దాటాక మెట్రోలు అందుబాటులో ఉండవు. మళ్లీ పొద్దునే మొదలవుతాయి. అయితే మెట్రో 24 గంటలు ఎందుకు అందుబాటులో ఉండవు అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నుండి రాత్రి వరకు మెట్రో ట్రైన్ నడుస్తూనే ఉంటుంది.
ఆ తర్వాత మెట్రోకు మరమ్మత్తులు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పనులన్నీ కూడా రాత్రిపూట చేస్తారు. మెట్రో ట్రైన్ అనేది ఎక్కువగా వాడుతారు కాబట్టి ఇందులో ప్రయాణించే వారి భద్రత ఎంతో అవసరం. అందుకే మెట్రోని ఎప్పటికి అప్పుడు పరీక్షిస్తూ ఉంటారు. రోజు ఈ పరీక్షలు జరుగుతాయి కాబట్టి కొంత సమయం మధ్యలో బ్రేక్ ఉండాలి. అందుకే ఒక సమయం తర్వాత మెట్రో సేవలు అందుబాటులో ఉండవు. ఈ విషయం గురించి ఢిల్లీ మెట్రో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మంగు సింగ్ మాట్లాడుతూ, “మెట్రో సేవని 24 గంటలు నడపడం సాధ్యం కాని పని.”
“చివరి రైలు అనేది రాత్రి 11 గంటల 30 నిమిషాలకి నడుస్తుంది. ఆ ట్రైన్ 12 గంటల 30 నిమిషాలకి డిపోకి చేరుకుంటుంది. ఆ తర్వాత 5 గంటల 30 నిమిషాలకి రైలు మళ్లీ తిరిగి నడవడం మొదలవుతుంది. మధ్యలో 4 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు సన్నాహాలు ప్రారంభం అవుతాయి. రాత్రి 12 గంటల 30 నిమిషాలకి నుండి ఉదయం 4 గంటల 30 నిమిషాలకి వరకు అన్ని రైళ్లు పరీక్షిస్తారు. ఇది భద్రత కోసం చాలా ముఖ్యం. ట్రాక్ మరమ్మతు, దాంతో పాటు ఎన్నో రకమైన విషయాల గురించి అదే సమయంలో పరీక్షలు చేస్తారు. అందుకే రాత్రిపూట మెట్రో అనేది నడవదు. ఆ సమయంలో సేవలు ఉండవు” అని చెప్పారు.
ALSO READ : పేటీఎం ఫిబ్రవరి 29 తరువాత పనిచేయదా..? ఈ లోగా కస్టమర్లు ఏం చేయాలి..?
End of Article