Ads
హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది బిర్యానీ మరియు ఇరానీ చాయ్. ఇక ఇరానీ చాయ్ తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. నగరంలో ఇరానీ చాయ్ కేఫ్ లు ఎక్కువగానే కనిపిస్తాయి. ఈ కేఫ్‌లు ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో నీలోఫర్ కేఫ్ ఒకటి.
Video Advertisement
ఈ కేఫ్ గురించి చాయ్ లవర్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ప్రారంభం అయిన ఈ కేఫ్ లో హైదరాబాదీలు ఒక్కసారైనా చాయ్ రుచి చూసుంటారు. అంత టేస్టి చాయ్ ఈ కేఫ్ లో దొరుకుతోంది. అయితే ఈ కేఫ్ యజమాని బాబూరావు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..
బాబూరావు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత ఏదైనా సాధించాలని హైదరాబాద్‌కు వచ్చారు. అయితే నగరానికి వచ్చిన తొలి రోజుల్లో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కూడా పడుకున్నాడు. మొదట్లో బట్టల షాప్ లో పనిచేశారు. కొన్ని చిన్న ఉద్యోగాలను చేశాడు. హోటల్ లో పనిచేస్తే కనీసం తినడానికి ఆహారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో కేఫ్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అలా కేఫ్‌లో క్లీనర్‌గా పనిచేయం ప్రారంభించిన బాబూరావు వెయిటర్‌గా ప్రమోషన్ పొందాడు. ఆ తరువాత బిస్కెట్లు, టీ తయారు చేశాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ 1978 నాటికి బాబురావు కేఫ్‌ను నడిపే స్థితి వచ్చాడు. కేఫ్ నడిపే కాంట్రాక్ట్ పై సంతకం చేశారు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, బాబూరావు కేఫ్ యాజమాన్యానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కష్టపడుతూ 1993 సంవత్సరం నాటికి కేఫ్‌ను సొంతం చేసుకోవడానికి అవసరం అయిన డబ్బును సంపాదించాడు. అప్పటి నుండి బాబూరావు ఓనర్ గా మారి, కేఫ్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. మూడు అవుట్‌లెట్‌ల యజమానిగా మారిన బాబూ రావు తన మూలాలను మర్చిపోలేదు.
ఈ కేఫ్ ద్వారా పేదవారికి సాయం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ షాపులో మిగిలిన బిస్కెట్లను, బ్రెడ్‌లను పేద వారికి పంచుతుంటారు. ఆయన తండ్రి కోరిక మేరకు 25 ఏళ్ల నుంచి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిలోఫర్ హాస్పిటల్ మరియు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న పేషంట్లకు, పేదవారికి ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఐదు వందల మందికి అల్పాహారం, మూడు వందల మందికి భోజనం అందిస్తున్నారు.
Also Read: అయోధ్య, జ్ఞానవాపి వెనుక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటి..?
End of Article