Ads
రామాయణ మహాభారతాలు రాముడు, కృష్ణుడు ఉన్నంతవరకు అందరికీ తెలిసిందే కానీ ఆ తరువాత ఏం జరిగింది అనే విషయం చాలామందికి తెలియదు. అలాగే మహాభారతం కూడా కురుక్షేత్రం వరకు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఆ తరువాత పాండవులు ఏమయ్యారు, కృష్ణుడు ఎలా మరణించాడు, యదు వంశం ఎందుకు నాశనం అయింది వంటి విషయాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులపాటు జరుగుతుంది. దేశంలోని 80% జనాభా ఈ యుద్ధంలో మరణిస్తారు. కౌరవులందరూ మరణించడంతో యుద్ధానికి కారణమైన శ్రీకృష్ణుడిని నా వంశం నాశనమైనట్లే నీ యదువంశం కూడా త్వరలోనే నాశనం అయిపోతుందని గాంధారి శపిస్తుంది.
Video Advertisement
పాండవులు హస్తినాపుర రాజ్యానికి పాలకులవుతారు. గాంధారి శపించిన 36 సంవత్సరాల తరువాత ఆమె శాపం ప్రకారమే ద్వారకలో అలజడులు చోటు చేసుకుంటాయి. ఇక యాదవ కులం అంతమయ్యే సమయం ఆసన్నమైందని గ్రహిస్తాడు కృష్ణుడు. తపస్సు చేసుకోవడానికి దట్టమైన అడవికి వెళ్తాడు. అదే అడవిలో ఒక వేటగాడు కృష్ణుడి పాదాలని జింకగా భావించి అతనిపై బాణ ప్రయోగం చేయడంతో అక్కడే దేహాన్ని విడుస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
ఇప్పుడు ఎవరైతే కృష్ణుడి పాదానికి బాణం వేసారో అతనే గత జన్మలో వాలి. శ్రీకృష్ణుడు ఎంతకీ కనిపించకపోవడంతో అర్జునుడు గోపాలుడి ని వెతుకుతూ వస్తుండగా అతనికి కృష్ణుడి పార్థివ దేహం కనిపిస్తుంది. అప్పటికే కృష్ణుడు మరణించి నాలుగు రోజులు కావడంతో అక్కడే తన సారధితో కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు అర్జునుడు. అప్పటికే ద్వారక సముద్రంలో మెల్ల మెల్లగా కలిసిపోతూ ఉంటుంది.
అదే ద్వాపర యుగానికి అంతం, కలియుగానికి ఆరంభం.ఈ సమయంలోనే ధర్మరాజు రాజ్యాన్ని అర్జునుడు కుమారుడైన పరీక్షిత్ కి అప్పగించి తన భార్య, మిగిలిన సోదరులతో కలిసి స్వర్గలోకానికి చేరేందుకు హిమాలకి వెళ్ళిపోతారు. అక్కడనుంచి స్వర్గారోహణ చేసే సమయంలో మధ్యదారిలో యమధర్మరాజు ఒక శునకంలా మారువేషంలో పాండవులతో కలిసి ప్రయాణిస్తాడు. దారిలోనే ధర్మరాజు తప్ప మిగిలిన వారందరూ ప్రాణాలు విడిచి పెట్టేస్తారు. వారికి నరకం ప్రాప్తిస్తుంది ధర్మరాజు మాత్రం స్వర్గం వరకు చేరుకుంటారు
End of Article