Ads
జామ్ నగర్ లో ముకేశ్ అంబానీ తన కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంత ఘనంగా చేశాడో అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫంక్షన్ లో అనిల్ అంబానీని చూసిన వాళ్లు షాక్ అయ్యారు. ఒక సామాన్యుడి లాగా తన లగేజ్ తనే మోసుకుంటూ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు అనిల్ అంబానీ ఫ్యామిలీ. ఒకప్పుడు ఆస్తుల విషయంలో అన్న కన్నా ఒక మెట్టు పైనే ఉన్న అనిల్ అంబానీ వ్యాపార దక్షత లేకపోవడం మూలంగా అప్పుల పాలైన సంగతి, జైలు పాలు అవ్వబోతున్న అతనిని అన్న ముఖేష్ కాపాడిన సంగతి ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
Video Advertisement
ఇంతకీ ఏం జరిగిందంటే 2002లో ధీరుభాయ్ అంబానీ చనిపోయినప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ముఖేష్ చైర్మన్, అనిల్ అంబానీ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. అప్పుడు నెట్వర్త్ 28,000 కోట్లు. 2005లో అన్నదమ్ములు విడిపోయిన తరువాత టెలికం, పవర్ జనరేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ లను అనిల్ అంబానీ తీసుకున్నారు. ఆయిల్ రిఫైనరింగ్, పెట్రో కెమికల్స్ బిజినెస్ ని ముఖేష్ తీసుకున్నారు. అప్పుడే ఎదుగుతున్న మంచి స్కోప్ ఉన్న టెలికాం బిజినెస్ ను అనిల్ అంబానీ కోరి మరి తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాపార సామర్థ్యం సరిగా లేక అనిల్ అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితికి వెళ్ళిపోయారు.
అదే సమయంలో ముఖేష్ అంబానీ క్రమంగా ఆసియా కుబేరుడు స్థాయికి ఎదిగారు. అనిల్ కు చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణాన్ని తీసుకుంది. తీవ్ర నష్టాల పాలైన రిలయన్స్ కమ్యూనికేషన్ చైనా బ్యాంకులకు రుణాలు చెల్లించలేకపోయింది. దాంతో తమకు రావలసిన 4,800 కోట్లు చెల్లించాలని ఆ కంపెనీలు కోర్టుకి వెళ్లాయి. వాదనలు విన్న కోర్టు జడ్జి 700 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు.
ఇప్పుడు ఆయన ఆస్తులు వేల్యూ పూర్తిగా పడిపోయిందని అనిల్ తరపు న్యాయవాది రాబర్ట్ హోవే కోర్టుకు విన్నవించారు. అయితే ఇంతకుముందు కూడా అనిల్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. స్వీడన్ కి చెందిన టెలికాం ఉపకరణాల తయారీ సంస్థకు R.Com చెల్లించాల్సిన 462 కోట్ల మొత్తాన్ని ముఖేష్ చెల్లించి తమ్ముడు జైలుకు వెళ్లకుండా కాపాడాడు. ఇదే విషయంగా అనిల్ అంబానీ స్పందిస్తూ ముఖేష్ అంబానీ దంపతులకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. జీవితాంతం తమ కుటుంబం వారికి రుణపడి ఉంటుందని చెప్పాడు.
article sourced from: idreampost
ALSO READ: ముకేశ్ అంబానీ ఎదిగినట్టు అనిల్ అంబానీ ఎందుకు ఎదగలేకపోయారు?
End of Article