Ads
ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగిన తరువాత అందరికీ అంబానీ ల ఆస్తి గురించిన చర్చ తలెత్తింది.ఈ కుటుంబం కి ఉన్న మొత్తం ఆస్తిలో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఉన్నాయి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
Video Advertisement
భారత్ లోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తగా ఉన్న ముఖేష్ అంబానీ కుటుంబానికి రిలయన్స్ గ్రూపులో ఉన్న వాటాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ముందుగా కోకిల బెన్ అంబానీ విషయానికి వద్దాం. ఈమె రిలయన్స్ ఇండస్ట్రీస్ ని స్థాపించిన ధీరుభాయ్ అంబానీ భార్య. ఈమెకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో 1,15,41,322 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలోని 0.24% వాటాకు సమానం. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే ముఖేష్ అంబానీ ఆయన ప్రైవేటు సంస్థలకు 47.29% వాటా ఉండగా 2019 సెప్టెంబర్ నాటికి అది 48.87% పెరిగింది. అయినప్పటికీ రిలయన్స్ కంపెనీలో అంబానీ అతిపెద్ద వాటాదారుగా లేకపోవడం గమనార్హం. ఈ విషయంలో కోకిల బెన్ వాటా ఎక్కువగా ఉంది. బిజినెస్ ఆపరేషన్స్ లో కోకిల బెన్ ఎక్కువగా యాక్టివ్ గా ఉండకపోయినా ఆమె పేరు మీదే ఎక్కువ వాటా ఉంది. లెక్కల ప్రకారం చూస్తే కంపెనీలోని 0.24% షేర్స్ ఈమె పేరు మీదే ఉన్నాయి.
అయితే ముఖేష్ అంబానీ షేర్స్ కేవలం 0.12% మాత్రమే ఉండడం గమనార్హం. కోకిల బెన్ నికర సంపాదన కచ్చితంగా తెలియకపోయినా 18 వేల కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ముఖేష్ అంబానీ పిల్లల విషయానికి వస్తే ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ, అనంత్ అంబానీలు ఒక్కొక్కరికి 80,52,021 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలో 0.12% వాటాకు దగ్గరగా ఉంది. వీరిలో అనంత్ అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆకాష్ అంబానీ, ఈషా అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు.
End of Article