Ads
రిలయన్స్ ఇండస్ట్రీస్. దేశంలోనే అతి పెద్ద కంపెనీ. ముఖేష్ అంబానీ ఎంతో కష్టపడి రిలయన్స్ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. రిలయన్స్ మధ్యలో కొంచెం వెనకబడినా కూడా మళ్లీ తన శక్తితో ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ మార్కెట్ విలువ దాదాపు 14.63 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. రిలయన్స్ సంస్థ అన్నాక చాలా పెద్దది కాబట్టి ఎంతో మంది ఇందులో పని చేస్తూ ఉంటారు. ఎన్నో విభాగాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే, ఇందులో అందరికంటే ఎక్కువ తీసుకునే వ్యక్తి ఒకరు ఉన్నారు. ముఖేష్ అంబానీ అనుకుంటే పొరపాటే. ఆయన పేరు నిఖిల్ మేస్వానీ.
Video Advertisement
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యంత ముఖ్యమైన పెట్రో కెమికల్ విభాగంలో, కెమికల్ ఇంజనీర్ గా ఈయన పనిచేస్తున్నారు. 1986 లో రిలయన్స్ కంపెనీలో నిఖిల్ చేరారు. తర్వాత డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 1988 జూలైలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు. నిఖిల్, ముఖేష్ అంబానీకి బంధువు అవుతారు. నిఖిల్ తండ్రి రసిక్ లాల్ మేస్వానీ ఈ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. నిఖిల్ సోదరుడు హితల్ మేస్వానీ కూడా ఇదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. నిఖిల్ ముంబై యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలో ఉన్న మసాచుసెట్స్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో మాస్టర్ చదివి, 1986 లో ఇండియాకి తిరిగి వచ్చేసారు. అప్పుడే రిలయన్స్ కంపెనీలో చేరారు.
మొదట పెట్రో కెమికల్ విభాగంలో బాధ్యతలు నిర్వహించిన తర్వాత, 1997 నుండి 2005 వరకు రిఫైనరీ బిజినెస్ కూడా చూసుకున్నారు. గ్రూప్ టాక్సేషన్, కార్పొరేట్ విభాగాలకు సంబంధించిన మరికొన్ని వ్యవహారాలు కూడా నిఖిల్ చూసుకున్నారు. నీతా అంబానీ ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలని కూడా నిఖిల్ చూసుకుంటారు. ఇండియన్ సూపర్ లీగ్ తో పాటు, రిలయన్స్ కంపెనీ భాగస్వామ్యం ఉన్న మిగిలిన క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిఖిల్ చూసుకుంటారు. అయితే, నిఖిల్ 2021 – 2022 సమయంలో సంవత్సరానికి 24 కోట్ల జీతం తీసుకున్నారు. ఇందులో జీతంతో పాటు ఇతర అలవెన్సులు, కమిషన్లు కలిపి ఉంటాయి.
అయితే, నిఖిల్ జీతం ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువగా ఉంది అని సమాచారం. ముఖేష్ అంబానీ సంవత్సరానికి 15 కోట్ల జీతం తీసుకుంటారు. 2008 -09 సంవత్సరం నుండి కూడా ముఖేష్ అంబానీ తనకి 15 కోట్ల జీతాన్ని పరిమితిగా నిర్ణయించుకున్నట్లు ఒక వార్త ఉంది. కోవిడ్ సమయంలో తన జీతాన్ని కూడా స్వచ్ఛందంగా వద్దు అనుకున్నారు. ఇంకొక ఐదేళ్ల పాటు ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ పదవిలో కొనసాగుతారు. అప్పుడు కూడా 15 కోట్ల జీతం తీసుకుంటారు. ఈ లెక్కన చూసుకుంటే నిఖిల్, ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువ జీతం తీసుకుంటున్నారు.
End of Article