Home Filmy Adda జరగండి పాటలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

జరగండి పాటలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

by Sainath Gopi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27వ తేదీన తన పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా నుండి జరగండి పాట రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అదే రోజు విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాటని, దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడారు. ప్రభుదేవా ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అనంత శ్రీరామ్ ఈ పాటని రాశారు. పాట చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. రియల్ లొకేషన్ ని పోలిన ఒక సెట్ వేసి ఈ పాటని చిత్రీకరించారు.

guntur kaaram game changer song comments

ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు, హీరోయిన్ కియారా అద్వానీ కూడా కనిపిస్తున్నారు. పాటలో వీళ్ళిద్దరి గెటప్స్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు అంటే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పాటల్లో సెట్టింగ్స్, లొకేషన్స్, హీరో హీరోయిన్స్ వేసుకునే బట్టలు, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. ఈ పాటలో కూడా అలాగే ఉన్నాయి. ఒక సందర్భంలో రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్ మీద కియారా అద్వానీ ఫోటోలు ఉన్నాయి. ఇలాంటి ఐడియాలు శంకర్ కి తప్ప మరి ఎవరికి కూడా రావు ఏమో.

mistake in game changer song

ఈ పాట చాలా సార్లు విడుదల చేద్దాం అనుకొని వాయిదా వేశారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు కంటే మంచి సందర్భం ఏం ఉంటుంది. అందుకే ఇవాళ ఈ పాటని విడుదల చేశారు. ఉదయం 9 గంటలకి ఈ పాటని విడుదల చేశారు. అయితే ఈ పాటలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఇవాళ రిలీజ్ చేసిన వీడియో లిరికల్ వీడియో కాబట్టి అందులో పాట లిరిక్స్ కూడా ఉన్నాయి. ఇందులో సర్ప్రైజ్ అనే పదం స్పెల్లింగ్ తప్పు రాసారు. SURPRISE అని రాయడానికి బదులుగా SUPPRISE అని రాసారు. దాంతో ఇది చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

You may also like