“రామ్ చరణ్-ఉపాసన” పెళ్లి పత్రిక చూశారా..? ఇందులో ఏం రాసి ఉందో తెలుసా..?

“రామ్ చరణ్-ఉపాసన” పెళ్లి పత్రిక చూశారా..? ఇందులో ఏం రాసి ఉందో తెలుసా..?

by Mohana Priya

Ads

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ చరణ్. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మెగా పవర్ స్టార్ అయ్యారు. మగధీర వంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే చాలా పెద్ద విషయం. ఆ విషయాన్ని రామ్ చరణ్ చేసి చూపించారు. ఆ తర్వాత నాయక్, ఎవడు వంటి సినిమాలతో కమర్షియల్ విజయాలని కూడా అందుకున్నారు. రంగస్థలం వంటి సినిమాతో ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి ప్రయోగం చేయాలి అనే ఆలోచనని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన నటుడు అయ్యారు.

Video Advertisement

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా కూడా, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో నమ్ముతారు. అందుకే, ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే, మరొక పక్క సమయం దొరికినప్పుడు కుటుంబంతో కూడా సమయాన్ని గడుపుతూ ఉంటారు. రామ్ చరణ్ 2012 లో ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు.

ram charan upasana wedding card

ఎంతో ఘనంగా వీరి పెళ్లి జరిగింది. ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది ప్రముఖులు వీరి పెళ్లికి హాజరు అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన పెళ్లి పత్రికను కూడా ఎంతో బాగా డిజైన్ చేయించారు. మెగా కుటుంబం అందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులు అనే విషయం తెలిసిందే. అందుకే పెళ్లి పత్రిక కూడా ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండేలాగా డిజైన్ చేయించారు. ఆంజనేయ స్వామి ప్రతిమని పెళ్లి పత్రిక మీద ముద్రించారు. వెంకటేశ్వర స్వామి ప్రతిమని కూడా పెళ్లి పత్రిక మీద ముద్రించారు. కొణిదల కుటుంబం, అల్లు కుటుంబం, లగ్గిశెట్టి కుటుంబం వారు ఆహ్వానిస్తున్నట్టుగా ఈ పత్రిక ఉంది.

తర్వాత సురేఖ గారి పేరు, చిరంజీవి పేరు ఉన్నాయి. శ్రీమతి, శ్రీ కొణిదల వెంకట్రావు గారి దంపతుల, శ్రీమతి, శ్రీ అల్లు రామలింగయ్య గారి దంపతుల మనవడు అయిన రామ్ చరణ్ అని రాసి ఉంది. శ్రీమతి శోభన గారు, శ్రీ అనిల్ కామినేని గారి కూతురైన ఉపాసన అని రాసి ఉంది. జూన్ 14వ తేదీ 2012, గురువారం రోజు, 7 గంటల 30 నిమిషాలకి, హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న హెచ్ఐసీసీలో వీరి పెళ్లి జరుగుతుంది అని రాసి ఉంది. ఆరోజు వీరి పెళ్లి టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ చేశారు. భారతదేశంలో ఉన్న ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఇతర రంగాలకి చెందిన ప్రముఖులు కూడా వీరు పెళ్లికి హాజరు అయి ఆశీస్సులు అందించారు.

ALSO READ : “తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత సంతోషం కలగలేదు..!” అంటూ… రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” జరగండి సాంగ్ పై 15 మీమ్స్..!


End of Article

You may also like