Ads
సినిమాల్లో పని చేసే వారికి ఎంత మంది అభిమానులు ఉంటారో, క్రికెట్ లో ఉన్నవారికి కూడా అంతే మంది అభిమానులు ఉంటారు. చాలా మంది ప్లేయర్స్ ని వాళ్ళు దేవుళ్ళులాగా భావిస్తారు. ముఖ్యంగా భారతదేశంలోనే ఇలా జరుగుతుంది. ఎంతో మంది ఆటగాళ్లని చాలా మంది అభిమానులు స్ఫూర్తిగా తీసుకొని, వారిలాగే అవ్వాలి అని అనుకుంటారు. కొంత మందిని వ్యక్తిగతంగా కూడా స్ఫూర్తిగా తీసుకునే వారు ఉంటారు. మహేంద్ర సింగ్ ధోని. ధోనికి ఆటకి ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఆయన బయట మాట్లాడే మాటలకు కూడా అంతే మంది అభిమానులు ఉన్నారు.
Video Advertisement
ఆయన మాటలు స్ఫూర్తిని ఇస్తాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ధోని ఎక్కడికైనా బయటికి వస్తేనే చూడడానికి ఎంతో మంది జనాలు వస్తారు. ధోని మ్యాచ్ ఉంది అన్నా కూడా స్టేడియం అంతా నిండిపోతుంది. ధోని ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడుతున్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కేవలం ధోని చూడడం కోసమే ఎన్నో లక్షల మంది వెళ్తూ ఉంటారు. అలా వారిలో ఒక అభిమాని కూడా ఉన్నారు. ధోనిని చూడడానికి అభిమాని వెళ్లడం అనేది సాధారణ విషయమే. కానీ అలా ధోనిని చూడడం కోసం ఆ అభిమాని చేసిన పని మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఎమ్మే చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. అందులో ఒక వ్యక్తి 64 వేలు కట్టి, టికెట్ తీసుకొని, స్టేడియంలోకి వెళ్లి, మ్యాచ్ చూసి, అక్కడ ధోనిని చూసి సంతోషపడ్డారు. ఈ వ్యక్తి ఆ విషయం మీద మాట్లాడుతూ, “నాకు టికెట్లు దొరకలేదు. అందుకే నేను బ్లాక్ లో టికెట్లు కొన్నాను. ఆ టికెట్ల ధర 64000 అయింది. నేను నా కూతుళ్ళ స్కూల్ ఫీజు కట్టలేదు. కానీ మాకు ధోనిని ఒక్కసారి అయినా చూడాలి అని ఉంది. ఇప్పుడు నా ముగ్గురు కూతుళ్లు, నేను చాలా ఆనందంగా ఉన్నాం” అని చెప్పారు. ఆ వ్యక్తి చిన్న కూతురు మాట్లాడుతూ, “మా నాన్న ఈ టికెట్లు కొనడానికి చాలా కష్టపడ్డారు. ధోని ఆడడానికి వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం” అని చెప్పింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు.
ALSO READ : “స్వాతంత్రం” కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టిన… ఈ 12 “అచ్చ తెలుగు” వీరులు ఎవరో తెలుసా..?
End of Article