సూపర్ మార్కెట్ లో బియ్యం, పప్పులు చివరి వరుసలో ఎందుకు పెడతారు..? గడియారం ఎందుకు ఉండదు..? ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

సూపర్ మార్కెట్ లో బియ్యం, పప్పులు చివరి వరుసలో ఎందుకు పెడతారు..? గడియారం ఎందుకు ఉండదు..? ఇలా చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

వస్తువులు అన్నీ ఒకటే చోట దొరికే ప్రదేశం సూపర్ మార్కెట్. ఒక సమయంలో, సూపర్ మార్కెట్ అంటే, కేవలం ఎక్కువ ధర ఉన్న వస్తువులు మాత్రమే అమ్ముతారు అని అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు డిస్కౌంట్ రేట్లతో, అందరికీ అందుబాటులో ఉండేలాగా సూపర్ మార్కెట్ లో వస్తువులు ఉంటున్నాయి. అందుకే, సూపర్ మార్కెట్ ఎక్కువ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే సూపర్ మార్కెట్ ని నడపడం అనేది చిన్న విషయం కాదు. చాలా తెలివిగా ఆలోచించి సూపర్ మార్కెట్ లో వస్తువులు ఏర్పాటు చేస్తారు. సూపర్ మార్కెట్ లో వస్తువులు ఏర్పాటు చేసే విధానం ప్రతి చోట ఒకటే లాగా ఉంటాయి. సూపర్ మార్కెట్ లో రోజువారి సామాన్లు అయిన బియ్యం, పప్పులు వంటి వస్తువులని చివరిలో పెడతారు.

Video Advertisement

reason why super markets did not have clock

అక్కడికి వెళ్లాలి అంటే మధ్యలో చాలా వస్తువులను దాటి వెళ్ళాలి. సూపర్ మార్కెట్ కి వెళ్ళంగానే చేతికి ఒక బుట్ట ఇస్తారు. మనం కొనుక్కున్న వస్తువులని అందులో వేయడానికి కాదు. ఆ బుట్టలో మనం ఒక్క వస్తువు వేస్తే, చాలా ఖాళీగా అనిపిస్తుంది. దాంతో అదంతా కూడా నింపాలి అని అనిపిస్తుంది. ఈ కారణంగానే, అంత పెద్ద బుట్టని ఇస్తారు. మూడవ వరసలో ఎక్కువగా బిస్కెట్లు, చాక్లెట్లు వంటివి పెడతారు. ఎందుకంటే, ఎవరైనా పిల్లలని తీసుకొస్తే, ఆ పిల్లలు అవన్నీ కావాలి అని అడిగితే, వాళ్లకు తీసుకోవడానికి సులభంగా ఉంటాయి కాబట్టి అవి పెడతారు. సూపర్ మార్కెట్  లో గడియారం ఉండదు. కస్టమర్ షాపింగ్ చేస్తున్నంత సేపు ఎంత సమయం గడిపారు అనేది తెలియదు కాబట్టి గడియారం పెట్టరు.

reason why super markets did not have clock

అంతే కాకుండా, సూపర్ మార్కెట్ లో కిటికీలు కూడా ఉండవు. కిటికీ నుండి చూస్తే బయట వాతావరణాన్ని బట్టి సమయం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా తెలియకుండా కిటికీలు పెట్టరు. అంతే కాకుండా బిల్లింగ్ కౌంటర్ దగ్గర మళ్లీ చాక్లెట్స్ పెడతారు. ఎందుకంటే వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా కొనాలి అనుకుంటే కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి పెడతారు. అన్ని సూపర్ మార్కెట్లలో ఇలా ఉంటుందా అంటే, సాధారణంగా మెయిన్ రోడ్ మీద ఏర్పాటు చేస్తున్న సూపర్ మార్కెట్లలో ఇలా ఉండే అవకాశాలు తక్కువ. గ్లాస్ డోర్స్ ఉంటాయి కాబట్టి, సమయం ఎంత అనేది దాన్ని చూసి కనిపెట్టే అవకాశం ఉంది. కానీ పైన ఫ్లోర్లలో కానీ, మెయిన్ రోడ్ మీద కాకుండా కాలనీల్లో ఉన్న సూపర్ మార్కెట్లలో ఇలాంటి నియమాలు పాటిస్తారు.

ALSO READ : పెళ్లి అయిన 8 సంవత్సరాల తర్వాత భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన భర్త…7 ఏళ్ల కూతురు సాక్షిగా..!


End of Article

You may also like