Home Off Beat ఫెయిర్నెస్ క్రీం కంపెనీలు ఇదేమైనా ఫెయిర్ గా ఉందా..? అందంగా ఉంటేనే విజయాలు సాధ్యమా?

ఫెయిర్నెస్ క్రీం కంపెనీలు ఇదేమైనా ఫెయిర్ గా ఉందా..? అందంగా ఉంటేనే విజయాలు సాధ్యమా?

by Megha Varna

అందం అంటే ఏమిటి ? అందంగా ఉండడం అంటే ఎలా ఉండాలి ? అందమైన కళ్లెలా ఉండాలి ? ముక్కు ఎంత పొడవుండాలి ? పెదాల రంగెలా ఉండాలి ? నుదురు ఎంత విశాలంగా ఉండాలి ? మనం అందంగా ఉన్నామని సర్టిఫై చేయాలంటే ఏ ప్రమాణాల ప్రకారం మనముండాలి . ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటే ఫెయిర్నెస్ క్రీం తయారు చేసినవాడైనా సరే చెప్పలేడు . ఫెయిర్నెస్ క్రీంని పీకలదాక మింగేసినా కూడా సమాధానం చెప్పలేడు .

representative image

ఆసియా వాసుల అందం ప్రమాణాలు యూరప్ వాసులకు ఎక్కవు , ఆఫ్రీకా వాసుల అందం ప్రమాణాలు ఆస్ట్రేలియా వాసులకు ఎక్కవు . ఎవరి అందం వారిదే . కానీ మొన్నటి వరకు జిడ్డుని మాయం చేసి మిమ్మల్ని అందంగా మారుస్తుంది మా క్రీం అంటూ ఊదరగొట్టిన కొన్ని ఫెయిర్నెస్ క్రీం సంస్థలు , ఇప్పుడు ఏకంగా ప్రకాశవంతంగా మెరిసిపోండి , మేలైన చర్మకాంతి అంటూ చావగొడ్తున్నాయి .

representative image

 

“మొదట్లో తెల్లబడతారని ప్రకటనలు వచ్చేవి . ఇప్పడు దాని స్థానంలో గ్లోయింగ్ మరియు బ్రైటనింగ్ స్కిన్ అంటూ వస్తున్నాయి . దీనికి కారణం అడ్వర్టైజ్‌మెంట్ అసోసియేషన్ గైడ్‌లైన్స్ కఠినంగా మారడమే . నిజంగా ఒక క్రీమ్ వాడడం చేత తెల్లబడినట్టైతే  దేశంలో అందరూ దాన్ని వాడుతున్నట్టైతే అందరి రంగూ మారాలి కదా. అయినా విషయం ఇక్కడ అది కాదు . కేవలం మెరిసే చర్మం మాత్రమే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది అనేది శుద్ద తప్పు .

representative image

మన దేశంలో తెల్ల రంగు అంటే  మోజు సర్వ సాధారణం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఐశ్వర్యరాయ్ ప్రపంచ సుందరిగా గెలిచిన ఏడాది పెరిగిన కాస్మోటిక్స్ వ్యాపారమే. అప్పటి నుండి మొదలైంది అందంగా కనపడడం అంటే తెల్లగా కనపడడమే . ఇదే విషయంపైన  పైనా బాలివుడ్ నటి నందితాదాస్ మొదటి నుండి ఫైట్ చేస్తూనే ఉన్నారు . బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ పేరిట ఒక క్యాంపెయిన్ రన్ చేశారు . మీరు గమనిస్తే ఎదుగుతున్న దేశాల వారికే ఈ అందాల కిరీటాలు ఇస్తారనేది పచ్చి నిజం మీకు కళ్లకట్టినట్టు కనపడుతుంది.

representative image

ఒకవైపు మహిళలు అన్ని రంగాల్లో తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ముందుకి వస్తుంటే , మరోవైపు అందంగా ఉంటేనే విజయాలు సాధ్యం అని చెప్పే ఇలాంటి యాడ్స్ మనకి ఏం ఇంజెక్ట్ చేస్తున్నట్టు . అందం అంటే ఆరోగ్యంగా ఉండడం, అందం అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడం, అందం అంటే ఆత్మాభిమానం కలిగి ఉండడం అని నేర్పించండి . అందం అనే భారాన్ని ఆడవాళ్లే ఎందుకు మోయాలి? అనే ప్రశ్నని మీకు మీరే వేసుకోండి.

representative image

మన అమ్మమ్మల కాలంలో ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ అని  పసుపుని వాడేవాళ్లు . దాని వల్ల అందానికి అందం, ఆరోగ్యం ఉండేది . అవన్ని వదిలేసి మార్కెట్ మాయజాలంలో పడి జంతు కలేభరాలనుండి తయారు చేసిన ఫెయిర్నెస్ క్రీముల వెంట పడుతున్నాము. కెమికల్ ఫెయిర్నెస్ క్రీమ్లు కొన్ని శరీరాలకి పడవు , కొన్ని శరీరాలకు పడతాయి .అందం మాట ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ వాడెరుగు  చర్మసంబంధ వ్యాధులతో మరో కొత్త తలనొప్పి . కొసమెరుపేంటంటే ఈ ఫెయిర్నెస్ క్రీములు మగాళ్లని కూడా వదల్లేదు .

You may also like