చాణక్య నీతి ప్రకారం ఇంటిని జైలుగా భావించకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు ఇవే.!

చాణక్య నీతి ప్రకారం ఇంటిని జైలుగా భావించకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు ఇవే.!

by Megha Varna

Ads

చాణక్యుడు ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వ్యక్తిగా మనం భావిస్తాం. ఆర్థిక సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా చాణక్యుడి అప్పట్లోనే సమాధానం ఇచ్చాడు.ఇప్పటికి ఎవరైనా రాజకీయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే అతనిని చాణక్యుడితో అభివర్ణిస్తారు .అప్పటి నుండి ఇప్పటి వరుకు రాజకీయాల్లో చాణుక్యుని సిద్ధాంతాలు పాటిస్తూనే ఉంటారు .

Video Advertisement

అనేకమంది రాజకీయవేత్తలు ,ఆర్ధిక నిపుణులు ఆయన  సిద్ధాంతాలను అనుగుణంగా నడుచుకుంటున్నారు .ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది .ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా సామజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి .దీంతో చాలా మంది ప్రజలు ఇల్లే జైలులా మారిపోయిందని బాధపడుతున్నారు .ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో ప్రజలు సతమత మవుతున్నారు .అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలా నడుచుకోవాలో చాణుక్యుని సిద్ధాంతాలు ఏమి బోధిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం .

మీ జీవితంలో విజయం సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి సరైన లక్ష్యాలు అవసరం . .సరైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం ఎంతైతే అవసరమో ఇతర వ్యక్తులతో మీ ప్రణాలికను గూర్చి చర్చించాకపోవడం కూడా అంతకంటే ముఖ్యం .కాగా ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సమయాన్ని ఉపయోగించి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాచ్చో ప్లాన్ చేసుకోవచ్చు .దాన్ని ఏ సమయంలో ఎలా అమలు చేయవచ్చో కూడా నిర్ణయించుకోవచ్చు . అయితే దీనిని గురించి మీ బంధువులతో గాని స్నేహితులతోగాని ఎవరితోనూ చర్చించకుండా ఉండాలి ..

ప్రతికూలతలోనూ సానుకూల దృక్పధం అలవాటు చేసుకోవాలి .ఎప్పుడు కూడా ఉత్సాహంగా ,ఆనందంగా ఉండే వారితోనే ఉండండి .అంతేగాని ఎప్పుడు మీకు ఫోన్ చేసో లేక మెసేజ్ చేసో తమ బాధలను చెప్పుకొనే వారి దగ్గర ఉండకండి .ఇలాంటి వారిని ఆఫీస్ వాతావరణంలో అయిన పర్సనల్ లైఫ్ లో అయిన వారిని దూరం పెట్టండి .ఎందుకంటే ఇలాంటివారి వాళ్ళ మిలో ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతాయి .

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమైన స్థితి . అయితే ఈ సమయంలో కొంత మంది ఆలస్యంగా నిద్ర లేవడం ,సరిగ్గా పళ్ళు తోమకపోవడం ఇంట్లినే ఉంటాం కదా అని స్నానం చేయకపోవడం చేస్తున్నారు . అయితే చాణక్య నీతి ప్రకారం ఎవరైతే శుభ్రమైన బట్టలు ధరించరో, పళ్లు సరిగ్గా తొముకోకుండా ఉంటారో, ఎక్కువగా తింటూ అసభ్యకర పదజాలాన్ని వాడతారో, సూర్యోదయం తర్వాత ఎవరైతే మేల్కొంటారో వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదట.

ఒక వ్యక్తి తన ఆదాయాన్ని ఎలా ఉపయోగించాలి , ఎవరి కోసం ఉపయోగించాలి అని చాణక్యుడు ఈ విషయాన్ని వెల్లడించాడు .ఎవరైనా డబ్బు ఆదా చేసుకోవడం గురించి ఆలోచించాలి.

చాణక్యుని నీతి ప్రకారం.. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ గురించి మనం బాధపడుతూ సమయాన్ని వృధా చేయకూడదు . ఎందుకంటే అది ఇప్పుడు మన చేతుల్లో లేదు. అనుకోకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే, మీరు దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా, మీ భవిష్యత్తు గురించి ద్రుష్టి పెట్టాలి. కాబట్టి లాక్ డౌన్ సమయంలో మీ పని గురించి మీరు చింతించకండి. రాబోయే కాలానికి ఆ తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి .


End of Article

You may also like