పావురాలు చెట్ల మీద గూడు ఎందుకు కట్టుకోవో తెలుసా? వెనకున్న ఆసక్తికర కారణం ఇదే.!

పావురాలు చెట్ల మీద గూడు ఎందుకు కట్టుకోవో తెలుసా? వెనకున్న ఆసక్తికర కారణం ఇదే.!

by Mohana Priya

Ads

మీరు ఎప్పుడైనా పావురం చెట్టు మీద కూర్చోవడం చూశారా, లేదా పావురం గూడు కట్టుకోవడం చూశారా. లేదు కదా. ఎందుకంటే పావురాలు గూడు కట్టుకోవు. సాధారణంగా పక్షి అన్న తర్వాత చెట్టు మీదే తన గూడు పెట్టుకుంటుంది. కానీ పావురాలు మాత్రం ఈ పద్ధతి పాటించవు. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం.

Video Advertisement

పురాతన కాలంలో రాజులు తమ సందేశాలను పంపడానికి పావురాలను ఉపయోగించేవారు. పావురాలు తమ కాళ్ళ కి ఆ సందేశాన్ని కట్టుకొని వేరే దేశం వెళ్లి అందించేవి. రాజులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి దారి మధ్యలో ఏ అడవిలో అయినా ఆగితే పావురాలను పట్టుకుని ఆ సందేశం చదివే అవకాశం ఉంది. కాబట్టి పావురాలు తమని తాము రక్షించుకోవడానికి చెట్ల మీద కాకుండా ఇళ్లలో తమ గూళ్ళని నిర్మించుకునేవి.

ఇప్పుడు మీలో చాలామంది పావురాలు చెట్లపై నివసించడం మేము చూశామని అనుకోవచ్చు. అవును మీరు చూసి ఉండొచ్చు. కాకపోతే అవి నగరాల్లో కాదు బాగా చెట్లు ఉన్న ప్రదేశాల్లో అయ్యుండొచ్చు. ఎందుకంటే అవి చెట్ల ప్రాంతంలో నివసిస్తాయి. కాబట్టి వాటికి చెట్లమీద ఉండటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం వాటిని పావురాలు అని పిలుస్తాం కానీ వాటి పేరు బ్యాండ్ టైల్డ్ పావురాలు. అవి ఎక్కువగా అటవీ ప్రాంతం లోనే ఉంటాయి.

నగరాల్లో మనం చూసే పావురాలు పేరు రాక్ డోవ్. అసలు రాక్ డవ్స్ యూరప్ నుండి వచ్చాయి.  భవనాలు, కిటికీలు, వంతెనలు, నగరానికి సమీపంలో ఉన్న కొండలకు దగ్గర రాక్ డవ్స్ ఉంటాయి. నార్త్ అమెరికా లాంటి ప్రదేశాలు ఈ పావురాల కి ఆహారం సరిగ్గా దొరకదు. కాబట్టి ఈ పావురాలు నగరంలో ఎక్కువ నివసిస్తాయి. పాతబడిన భవనాలు, గుహలలో కూడా ఇవి నివసిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్ సముద్రం దగ్గర కొండల మీద ఇవి ఎక్కువగా కనిపించేవి. కానీ తర్వాత మెల్ల మెల్లగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయాయి. పట్టణాల్లో ఉండడం అలవాటు అయిపోవడం వల్ల రాక్ డవ్స్ జనాలకి భయపడవు.

మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు. కాలక్రమంలో లో మనిషిలో ఆ కోతి లక్షణాలు అన్నీ పోయాయి. ఉదాహరణ చెట్లు ఎక్కడం, వేలాడటం. మనిషిగా మారకముందు కోతి చెట్లెక్కి ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు కి దూకుతూ వేలాడేది. కానీ మనిషి గా మారిన తర్వాత చెట్ల మీద ఎక్కడం వేలాడటం లాంటి వాటి మీద పట్టు తప్పింది. అదేవిధంగా పావురాలు కూడా కాలక్రమేణా వాటి కండరాల్లోని బలం కోల్పోయాయి. చెట్లమీద ఎక్కువ సేపు నిల్చునే అంత బలం పావురాలకు లేదు. అందుకే అవి చెట్లమీద ఉండవు.

ఇవి చెట్ల మీద పావురాలు ఉండకపోవడానికి గల కారణాలు.

 


End of Article

You may also like